Tollywood : ఓటీటీ ఊసే లేని సినిమాలు ఇవే .. ఇంకెన్నాళ్లు ఈ ఎదురుచూపులు..
థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓటీటీల్లో నెల రోజుల వ్యవధిలోనే ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలైతే రిలీజ్ అయిన వారం పదిరోజులకే ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. కానీ కొన్ని సినిమాలు థియేటర్స్ లోకి వచ్చి చాలా కాలం అవుతున్నాకూడా ఓటీటీ రిలీజ్ మాత్రం అవ్వడంలేదు. కొన్ని సినిమాలు ఓటీటీ రిలీజ్ లకోసం చాలా సమయం తీసుకుంటున్నాయి. అలాంటి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది
ఈ మధ్య కాలంలో ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. థియేటర్స్ లో సినిమాలు చూడటం కంటే ఓటీటీల్లోనే సినిమాలు చూడటానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే థియేటర్స్‌లో రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓటీటీల్లో నెల రోజుల వ్యవధిలోనే ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలైతే రిలీజ్ అయిన వారం పదిరోజులకే ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. కానీ కొన్ని సినిమాలు థియేటర్స్‌లోకి వచ్చి చాలా కాలం అవుతున్నాకూడా ఓటీటీ రిలీజ్ మాత్రం అవ్వడంలేదు. కొన్ని సినిమాలు ఓటీటీ రిలీజ్‌లకోసం చాలా సమయం తీసుకుంటున్నాయి. అలాంటి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ఏజెంట్ సినిమా గురించే.. అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఏజెంట్ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. కానీ సినిమా బోల్తాకొట్టింది. మొదటి షో నుంచే ఏజెంట్ మూవీ నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇంతవరకు ఈ సినిమా ఓటీటీలోకి మాత్రం రాలేదు. సినిమా రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నాకూడా ఓటీటీకి నోచుకోలేదు ఏజెంట్.
View this post on Instagram
అలాగే గోపిచంస్ హీరోగా నటించిన రామబాణం సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో గోపీచంద్ తో పాటు జగపతి బాబు నటించారు. రామబాణం సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్ గా చేసింది. ఈ మూవీ కూడా ఇంతవరకు ఓటీటీలోకి రాలేదు.
View this post on Instagram
అలాగే అదాశర్మ ప్రధాన పాత్రలో నటించిన కేరళ స్టోరీ సినిమా కూడా ఓటీటీ బాట పట్టలేదు. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే కొన్ని వివాదాల్లోనూ చిక్కుకుంది ఈ సినిమా. ఇక ఈ సినిమా కూడా ఓటీటీలోకి అడుగు పెట్టలేదు. కేరళ స్టోరీ ఓటీటీలోకి రాబోతుందని గతంలో అదా శర్మ కూడా తెలిపింది. కానీ ఇంతవరకు ఈ సినిమా ఓటీటీలోకి రాలేదు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.