Prabhas- Anushka-Ram Charan: ప్రభాస్‌, అనుష్క మధ్య వంటల పోటీ.. ఇప్పుడు చెర్రీ వంతు కూడా.. ఎవరు ఏమేం వండారంటే?

నిశ్శబ్దం తర్వాత మూడేళ్లు గ్యాప్‌ తీసుకుంది అందాల తార అనుష్కాశెట్టి. మధ్యలో కొన్ని సినిమాకు తెరమీదకు వచ్చినా పట్టాలెక్కేలేదు. అయితే ఈ మూడేళ్ల గ్యాప్‌ను కవర్‌ చేస్తూ ఇప్పుడు 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి' మూవీతో మన ముందుకు రానుంది స్వీటీ. పి. మహేశ్‌ బాబు తెరకెక్కించిన ఈ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైన్‌ర్‌లో నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ గురువారం (సెప్టెంబర్‌ 7) న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.

Prabhas- Anushka-Ram Charan: ప్రభాస్‌, అనుష్క మధ్య వంటల పోటీ.. ఇప్పుడు చెర్రీ వంతు కూడా.. ఎవరు ఏమేం వండారంటే?
Prabhas, Anushka,ram Charan
Follow us
Basha Shek

|

Updated on: Sep 06, 2023 | 1:01 PM

నిశ్శబ్దం తర్వాత మూడేళ్లు గ్యాప్‌ తీసుకుంది అందాల తార అనుష్కాశెట్టి. మధ్యలో కొన్ని సినిమాకు తెరమీదకు వచ్చినా పట్టాలెక్కేలేదు. అయితే ఈ మూడేళ్ల గ్యాప్‌ను కవర్‌ చేస్తూ ఇప్పుడు ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ మూవీతో మన ముందుకు రానుంది స్వీటీ. పి. మహేశ్‌ బాబు తెరకెక్కించిన ఈ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైన్‌ర్‌లో నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ గురువారం (సెప్టెంబర్‌ 7) న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. హీరో నవీన్‌ పొలిశెట్టి తనదైన శైలిలో ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళుతున్నాడు. ఇక ఇదే సినిమాలో చెఫ్‌ పాత్రలో కనిపించిన అనుష్క మాత్రం వెరైటీగా మూవీ ప్రమోషన్స్‌ చేప్తోంది. ఇందులో భాగంగా తనకు బాగా ఇష్టమైన ఓ వంటకం తయారీ విధానాన్ని ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. ఆ తర్వాత #MSMPRecipeChallenge పేరుతో ఓ కొత్త ఛాలెంజ్‌ను విసిరింది. తన ఫేవరెట్‌ ఫుడ్‌ రెసిపీ మంగళూరు చికెన్‌ కర్రీ, నీర్‌ దోశ ఎలా తయారు చేయాలో వివరిస్తూ అనుష్క ట్వీట్‌ చేసింది. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాలో చెఫ్‌ పాత్రలో కనిపించనున్నాను. అందుకే నాకు ఇష్టమైన వంటకాలను మీ అందరితో పంచుకుంటున్నాను. అలాగే ఓ కొత్త ఛాలెంజ్‌ను కూడా మొదలు పెడుతున్నాను. మొదట ప్రభాస్‌కు ఛాలెంజ్‌ విసురుతున్నా. భోజనాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తి.. అలాగే అతిథులను తన భోజనాలతో ఆశ్చర్యపరిచే వ్యక్తి ప్రభాస్‌. ఇప్పుడు తన ఫేవరెట్‌ వంటకాన్ని ఎలా తయారు చేస్తారో వివరిస్తూ ప్రభాస్‌ పోస్ట్‌ షేర్‌ చేయాలి’ అంటూ డార్లింగ్‌ను ట్యాగ్‌ చేసింది అనుష్క.

అనుష్క ఛాలెంజ్‌కు వెంటనే రియాక్ట్‌ అయ్యాడు ప్రభాస్‌. ఈ సవాలును స్వీకరిస్తున్నట్లు వెంటనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. ‘నాకు స్వీటీ (అనుష్క) చాలా ఏళ్ల నుంచి తెలుసు. అయితే తన ఫేవరెట్‌ ఫుడ్‌ ఏంటో ఇప్పుడే తెలిసింది. నేను తన ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నాను. నాకు ఎంతో ఇష్టమైన రొయ్యల పులావ్‌ను ఎలా చేయాలో మీ అందరితో పంచుకుంటున్నాను. రామ చరణ్‌ దీనిని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా’ అంటూ చెర్రీని ట్యాగ్‌ చేశాడు ప్రభాస్‌. అలాగే అభిమానులు కూడా తమకు ఇష్టమైన వంటకాలు, వాటి తయారీ విధానాలను పంచుకోవాల్సిందిగా కోరాడు డార్లింగ్‌. మొత్తానికి #MSMPRecipeChallenge పేరుతో స్టార్‌ నటీనటుల వంటల పోటీలతో సోషల్‌ మీడియా సందడి సందడిగా మారింది. మరి రామ్‌ చరణ్‌కు ఏ వంటకం గురించి షేర్‌ చేస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అనుష్క రెసిపీ ఛాలెంజ్..

ప్రభాస్ రియాక్షన్ ఇదే..

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.