Jailer OTT: ఓటీటీ ఆడియెన్స్‌ గెట్‌ రెడీ.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‌కు రజనీకాంత్ ‘జైలర్‌’.. ఎక్కడంటే?

సన్‌పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మించిన జైలర్‌ సినిమా ఆగస్టు 10 న థియేటర్లలో రిలీజైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్ట రజనీకి గ్రేట్‌ కమ్ బ్యాక్‌ మూవీగా నిలిచింది. ఇప్పటివరకు రూ. 650 కోట్లు రాబట్టిన జైలర్‌ రజనీ నటించిన 2.ఓను కూడా అధిగమించింది. సూపర్‌స్టార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

Jailer OTT: ఓటీటీ ఆడియెన్స్‌ గెట్‌ రెడీ.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‌కు రజనీకాంత్ 'జైలర్‌'.. ఎక్కడంటే?
Rajinikanth Jailer Movie
Follow us
Basha Shek

|

Updated on: Sep 06, 2023 | 1:32 PM

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమా ‘జైలర్‌’. నెల్సన్‌ దీలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన ఈ యాక్షన్‌ డ్రామాలో కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్‌, మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ కీలక పాత్రలు పోషించారు. అలాగే జాకీ ష్రాఫ్‌, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. సన్‌పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మించిన జైలర్‌ సినిమా ఆగస్టు 10 న థియేటర్లలో రిలీజైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్ట రజనీకి గ్రేట్‌ కమ్ బ్యాక్‌ మూవీగా నిలిచింది. ఇప్పటివరకు రూ. 650 కోట్లు రాబట్టిన జైలర్‌ రజనీ నటించిన 2.ఓను కూడా అధిగమించింది. సూపర్‌స్టార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడనుంది. మరికొన్ని గంటల్లో జైలర్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే రజనీ బ్లాక్ బస్టర్‌ మూవీ అందుబాటులోకి రానుంది. తమిళ్‌ తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో జైలర్ స్ట్రీమింగ్‌ కానుంది. జైలర్‌ ఓటీటీ రిలీజ్‌ కు సంబంధించి ఇప్పటికే సోషల్‌ మీడియాలో రజనీ ఫ్యాన్స్‌ తెగ సందడి చేస్తున్నారు. ‘వెయిటింగ్‌ ఫర్‌ జైలర్‌’ అంటూ పోస్టులు షేర్‌ చేస్తున్నారు.

కాగా కొన్ని రోజుల క్రితం జైలర్‌ సినిమా ఆన్‌లైన్‌లో లీకైన సంగతి తెలిసిందే. హెచ్‌డీ ప్రింట్‌ పలు పైరసీ వెబ్‌సైట్లలో కనిపించింది. దీంతో రజనీ ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు. చిత్రబృందం కూడా అప్పటికప్పుడు జైలర్‌ పైరసీ లింక్‌లను తొలగించే ప్రయత్నం చేసింది. జైలర్‌ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. దీంతో హీరో రజనీ, డైరెక్టర్‌ దిలీప్‌ కుమార్‌, మ్యూజిక్‌ డైరెక్టర్లకు క్యాష్‌ చెక్‌లతో పాటు ఖరీదైన లగ్జరీ కార్లు కానుకగా ఇచ్చారు. ఇక తాజాగా అపోలో ఆస్పత్రికి కూడా కోటి రూపాయల విరాళం అందించారు.

ఇవి కూడా చదవండి

నెట్టింట రజనీ ఫ్యాన్స్ సందడి.. 

హీరో రజనీకాంత్ కు ఖరీదైన కారుగా బహుమతిగా ఇస్తోన్న జైలర్ నిర్మాత కళానిధి మారన్

View this post on Instagram

A post shared by Sun Pictures (@sunpictures)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..