Jaane Jaan OTT: డైరెక్టుగా ఓటీటీలోకి కరీనా, విజయ్‌ వర్మల క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ.. ‘జానేజాన్‌’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రస్తుతం ఓటీటీలకు క్రేజ్‌ బాగా పెరిగిపోయింది. థియేటర్లలో సినిమాలు విడుదలవుతున్నా చాలా మంది ఓటీటీలకే ఓటేస్తున్నారు. అందుకే బిగ్‌స్టార్స్‌ సైతం డిజిటల్‌ రంగంలోకి అడుగుపెడుతున్నారు. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో ఓటీటీ ఆడియెన్స్‌ను అలరిస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌ అందాల భామ, సీనియర్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఆమె నటించిన లేటెస్ట్‌ సినిమా 'జానేజాన్‌'.

Jaane Jaan OTT: డైరెక్టుగా ఓటీటీలోకి కరీనా, విజయ్‌ వర్మల క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ.. 'జానేజాన్‌' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Jaane Jaan Movie
Follow us
Basha Shek

|

Updated on: Sep 06, 2023 | 11:56 AM

ప్రస్తుతం ఓటీటీలకు క్రేజ్‌ బాగా పెరిగిపోయింది. థియేటర్లలో సినిమాలు విడుదలవుతున్నా చాలా మంది ఓటీటీలకే ఓటేస్తున్నారు. అందుకే బిగ్‌స్టార్స్‌ సైతం డిజిటల్‌ రంగంలోకి అడుగుపెడుతున్నారు. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో ఓటీటీ ఆడియెన్స్‌ను అలరిస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌ అందాల భామ, సీనియర్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఆమె నటించిన లేటెస్ట్‌ సినిమా ‘జానేజాన్‌’. సుజయ్ ఘోష్‌ తెరకెక్కించిన ఈ సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీలో తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్‌ వర్మ, జైదీప్ అహ్లావత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న జానేజాన్‌ డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్‌ కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ లో సెప్టెంబర్‌ 21 నుంచి కరీనా, విజయ్‌వర్మల మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌. అలాగే మూవీ ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ ట్రైలర్‌ను ఇప్పటివరకు 7.5 లక్షల మందికి పైగా వీక్షించారని తెలిపింది చిత్రబృందం. కాగా జానేజాన్‌ ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌లో హీరోయిన్‌ కరీనా కపూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఫస్ట్‌ టైం నన్ను ప్రేక్షకులు ఒక క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలో కొత్త కోణంలో చూడబోతున్నారు. ఈ సినిమా ఒప్పుకోవడానికి ముందే నా భర్త (సైఫ్‌ అలీఖాన్‌) నాకు వార్నింగ్‌ ఇచ్చారు. ఓటీటీలో అదరగొడుతోన్న ఇద్దరు ప్రతిభావంతులైన నటీనటులు (విజయ్‌ వర్మ, జైదీప్ అహ్లావత్)తో కలిసి పనిచేస్తున్నావు. కాబట్టి నువ్వు ముందుగానే ప్రిపేర్‌ అవ్వాలని సైఫ్‌ నాతో చెప్పాడు’ అని తెలిపింది కరీనా.

ఇవి కూడా చదవండి

కాగా ఒక జపనీస్ పుస్తకం ఆధారంగా జానేజాన్‌ను తెరకెక్కించారు సుజయ్‌ ఘోష్‌. శోభాకపూర్‌, ఏక్తా కపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ట్రైలర్‌ చూస్తే ఇదొక ఇంటెన్స్‌ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అని తెలుస్తోంది. ఇందులో కరీనా మాయా డిసౌజ్‌ అనే పాత్రలో నటిస్తోంది. తన భర్తను హత్య చేసిన మాయ అనే మహిళ ఆ రహస్యాన్ని దాచిపెట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసింది? ఇందులో కరణ్‌ ఆనంద్‌ (విజయ్‌ వర్మ), నరేన్‌ (జై దీప్‌ అహ్లావత్‌) ల పాత్రలు ఏంటి? అన్నది తెలుసుకోవాలంటే జానేజాన్‌ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్‌. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజువుతుందా? లేదా? అన్నది ఇంకా క్లారిటీ రావల్సి ఉంది.

‘జానే జాన్’ సినిమా ట్రైలర్

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..