Athidhi OTT: ఓటీటీలో మరో తెలుగు హార్రర్‌ వెబ్‌ సిరీస్‌.. వేణు ‘అతిథి’ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

ఓటీటీలో హార్రర్‌, క్రైమ్‌, థ్రిల్లర్‌ జోనర్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకు మంచి ఆదరణ ఉంటుంది. అందుకు తగ్గట్లే ఓటీటీ సంస్థలు సరికొత్త కంటెంట్‌తో సినిమాలు, సిరీస్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. వీటికున్న క్రేజ్‌ దృష్ట్యా స్టార్‌ హీరోలు, హీరోయిన్లు సైతం డిజిటల్‌ స్ట్రీమింగ్‌ మూవీస్‌, వెబ్‌ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలా తాజాగా మరొక సీనియర్‌ హీరో ఓటీటీలోకి అడుగుపెట్టాడు. అతను మరెవరో కాదు..

Athidhi OTT: ఓటీటీలో మరో తెలుగు హార్రర్‌ వెబ్‌ సిరీస్‌.. వేణు 'అతిథి' స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Athidhi Web Series
Follow us
Basha Shek

|

Updated on: Sep 08, 2023 | 5:59 PM

ఓటీటీలో హార్రర్‌, క్రైమ్‌, థ్రిల్లర్‌ జోనర్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకు మంచి ఆదరణ ఉంటుంది. అందుకు తగ్గట్లే ఓటీటీ సంస్థలు సరికొత్త కంటెంట్‌తో సినిమాలు, సిరీస్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. వీటికున్న క్రేజ్‌ దృష్ట్యా స్టార్‌ హీరోలు, హీరోయిన్లు సైతం డిజిటల్‌ స్ట్రీమింగ్‌ మూవీస్‌, వెబ్‌ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలా తాజాగా మరొక సీనియర్‌ హీరో ఓటీటీలోకి అడుగుపెట్టాడు. అతను మరెవరో కాదు గతంలో స్వయం వరం, చిరునవ్వుతో, హనుమాన్‌ జంక్షన్‌ వంటి సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన వేణు తొట్టెంపూడి. రవితేజ నటించిన రామారావు ఆన్‌ డ్యూటీతో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసిన వేణుకు ఆ సినిమా నిరాశనే మిగిల్చింది. ఇప్పుడు ఓటీటీల్లో తన అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. ఇందులో భాగంగా అతిథి అనే పేరుతో ఓ హార్రర్‌ వెబ్ సిరీస్‌తో మన ముందుకు వస్తున్నాడు. వేణుతో పాటు అవంతిక, రవివర్మ, భద్రం, అదితి గౌతమ్‌, వెంకటేష్ కాకుమాను, చాణక్య తేజ, గాయత్రి చాగంటి, పూజ తదితరులు ఈ సిరీస్‌లో కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న అతిథి ఓటీటీ ఆడియెన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. సెప్టెంబర్‌ 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

తాజాగా అతిథి వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇందులో వేణు రైటర్‌ రవిగా కనిపించనున్నాడు. అతనికి దయ్యాలంటే పెద్దగా నమ్మకం, భయము ఉండవు. ఒకరోజు రవి ఉంటునన ఇంట్లోకి అతిథిఆ ఓ అమ్మాయి వస్తుంది. తను దెయ్యం అని స్నేహితుడు చెప్పినా వినడు రవి. అందుకు తగ్గట్లే అమ్మాయి ఎంటరైన తర్వాత ఇంట్లో ఎన్నో విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ అమ్మాయి కూడా వింతగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. ఇంతకీ ఈమె ఎవరు? మనిషా లేదా దయ్యామా? అసలు రవి ఇంట్లోకి ఎందుకొచ్చిందో తెలుసుకోవాలంటే అతిథి వెబ్‌ సిరీస్‌ చూడాల్సిందే. రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్‌ టైన్మెంట్స్‌ బ్యానర్‌పై డైరెక్టర్‌ భరత్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించాడు. ఇటీవలే గాంఢీవ ధారి అర్జునతో మనముందుకు వచ్చిన క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు అతిథి వెబ్‌ సిరీస్‌కు షో రన్నర్‌గా వ్యవహరిస్తుండడం విశేషం.

ఇవి కూడా చదవండి

‘అతిథి’ వెబ్ సిరీస్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?