2018 Movie: టీవీలోకి బ్లాక్ బస్టర్ మూవీ.. ప్రముఖ ఛానెల్‌లో ‘2018’ తెలుగు వెర్షన్.. ఎప్పుడంటే?
ఎలాంటి అంచనాలు లేకుండా మే5న చిన్న సినిమాగా విడుదలైన 2018 సూపర్ డూపర్‌హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కనివినీ ఎరుగని రీతిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మలయాళ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తుడిచిపెట్టేసింది. ఇక 3 వారాలు ఆలస్యంగా తెలుగులో రిలీజైనా భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఆ తర్వాత ఓటీటీలోనూ..
2018లో కేరళలో సంభవించిన వరదలను ప్రతిబింబిస్తూ తెరకెక్కిన సినిమా 2018. మిన్నల్ మురళితో తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న వెర్సటైల్ హీరో టొవినో థామస్ ఇందులో కథానాయకుడు. ఆకాశం నీ హద్దురా ఫేమ్ అపర్ణా బాల మురళి, కుంచకో బోబన్, అసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, లాల్ వంటి స్టార్ యాక్టర్స్ కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు జూడ్ ఆంథోనీ ఎంతో హృద్యంగా ఈ మూవీని తెరకెక్కించారు . ఎలాంటి అంచనాలు లేకుండా మే5న చిన్న సినిమాగా విడుదలైన 2018 సూపర్ డూపర్‌హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కనివినీ ఎరుగని రీతిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మలయాళ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తుడిచిపెట్టేసింది. ఇక 3 వారాలు ఆలస్యంగా తెలుగులో రిలీజైనా భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఆ తర్వాత ఓటీటీలోనూ 2018 మూవీకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 7 నుంచి ప్రముఖ ఓటీటీలో సోనీ లివ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాగా, రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. తాజాగా 2018 సినిమా తెలుగు వెర్షన్ టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఆదివారం (సెప్టెంబర్10) సాయంత్రం ఆరుగంటల నుంచి స్టార్ మా ఛానెల్‌లో 2018 ప్రసారం కానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటనను రిలీజ్ చేసింది స్టార్ మా.
సినిమా కథేంటంటే..
2018 సినిమాను తెలుగులో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాసు రిలీజు చేశారు. నోబిన్ పాల్, విలియం ఫ్రాన్సిస్ బీజీఎమ్, స్వరాలు సమకూర్చారు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. 2018 వరదల కారణంగా ఇడుక్కి డ్యామ్ తెగిపోతుంది. దీంతో సమీపంలోని ఇళ్లన్నీ నీటమునుగుతాయి. ఈ సమయంలో ఆర్మీలో ఉద్యోగం మానేసిన అనూప్ (టొవినో థామస్), వాతావరణ శాఖలో పనిచేసే షాజీ, దుబాయ్ నుంచి అమ్మను చూసేందుకు వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ (వినీత్ శ్రీనివాసన్)లు వరదల నుంచి జనాన్నిరక్షించేందుకు నడుంబిగిస్తారు. ఈ నేపథ్యంలో వారికెలాంటి అనుభవాలు ఎదరయ్యాయనేది ఎంతో ఎమోషనల్‌గా తెరకెక్కించారు డైరెక్టర్. క్లైమాక్స్‌లో అయితే చాలామంది కన్నీరు పెట్టుకుంటారు. అంతలా హార్ట్ టచింగ్‌గా సాగుతుందీ మూవీ. మరి థియేటర్లు, ఓటీటీలో 2018 మిస్ అయినవారు ఎంచెక్కా ఇంట్లోనే టీవీలో చూసి ఎంజాయ్ చేయండి..
స్టార్ మా ఛానెల్ లో 2018 టెలికాస్ట్..
View this post on Instagram
2018 సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.