Bigg Boss 7 Telugu: హౌస్లో లవ్ ట్రాక్స్.. అతను మాత్రమే ఫేక్.. అన్ని గాసిప్స్ బయటపెట్టిన షకీలా, తేజ..
కొందరు కంటెస్టెంట్లను పిలిచి మరీ ఇంట్లో గాసిప్స్ ఏమున్నాయో చెప్పాలంటూ ఆర్డర్ వేశాడు బిగ్బాస్. దీంతో తప్పక చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా తేజ, షకీలా హౌస్లో లవ్ ట్రాక్, ఫేక్ ఎవరనేది బయటపెట్టారు. బిగ్బాస్ ప్రతి సీజన్లో ఎవరి మధ్యనైనా లవ్ ట్రాక్ ఉండడం కామన్. అలాగే గ్రూప్స్ కూడా రెడీ అవుతుంటాయి. ఇక ఈసారి గ్రూప్స్ ఇంకా రెడీ కాలేదు.. కానీ అప్పుడే లవ్ ట్రాక్ మాత్రం పట్టాలెక్కినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఇంట్లో తాము గమనించిన విషయాలను తనతో చెప్పాలన్నారు బిగ్బాస్ .
బిగ్బాస్ సీజన్ 7 స్టార్ట్ అయ్యి వారం కూడా కాలేదు.. అప్పుడే ఇంట్లో గాసిప్స్ మొదలయ్యాయి. ఇక వాటిని బయటపెట్టించేందుకు సిద్ధమయ్యారు పెద్దయ్య. కొందరు కంటెస్టెంట్లను పిలిచి మరీ ఇంట్లో గాసిప్స్ ఏమున్నాయో చెప్పాలంటూ ఆర్డర్ వేశాడు బిగ్బాస్. దీంతో తప్పక చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా తేజ, షకీలా హౌస్లో లవ్ ట్రాక్, ఫేక్ ఎవరనేది బయటపెట్టారు. బిగ్బాస్ ప్రతి సీజన్లో ఎవరి మధ్యనైనా లవ్ ట్రాక్ ఉండడం కామన్. అలాగే గ్రూప్స్ కూడా రెడీ అవుతుంటాయి. ఇక ఈసారి గ్రూప్స్ ఇంకా రెడీ కాలేదు.. కానీ అప్పుడే లవ్ ట్రాక్ మాత్రం పట్టాలెక్కినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఇంట్లో తాము గమనించిన విషయాలను తనతో చెప్పాలన్నారు బిగ్బాస్ . గురువారం ఎపిసోడ్ లో షకిలా నిద్రపోతుండగా.. ఆమెను కన్ఫెషన్ రూంలోకి పిలిచాడు. ముందుగా మీకు పల్లవి ప్రశాంత్ ఎలా అనిపిస్తున్నాడని అడగ్గా… ఎలాగైన గేమ్ విన్ అవ్వాలనే మోటివ్ తో తాను ఇంట్లోకి వచ్చినట్లుగా తెలుస్తోందని తెలిపింది.
ఇప్పటివరకు తన జీవితంలో అనేక ఫెయిల్యూర్స్ చూసిన ప్రశాంత్ ఇక్కడి వరకు వచ్చాడని.. దీని కోసం ఎంత దూరమైన వెళ్లేందుకు ట్రై చేస్తున్నాడని.. ఈ క్రమంలోనే చిన్న ఫెయిల్యూర్ వచ్చినా తట్టుకోలేక ఎమోషనల్ అవుతున్నాడని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఇంట్లో ఫేక్ ఎవరనిపిస్తున్నారని అడగ్గా… మళ్లీ ప్రశాంత్ పేరే తీసుకువచ్చింది. అతని నవ్వు ఫేక్ అని.. ఇంట్లో ఉన్నవారు తనతో కలవాలని ప్రయత్నించినా దూరంగా ఉంటున్నాడని చెప్పుకొచ్చింది.
View this post on Instagram
ఇక గాసిప్స్ గురించి చెప్పాలని అడగ్గా.. ప్రశాంత్ ను రతిక ఇన్ఫ్లూయెన్స్ చేస్తుందని.. ఎవరైనా ముట్టుకుంటే కోపం వచ్చినట్లుగా యాక్టింగ్ చేస్తుందని.. రాబోయే రోజుల్లో ప్రశాంత్ దీనిని సీరియస్ గా తీసుకోవచ్చని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. గౌతమ్, సుభా శ్రీ లేట్ నైట్ వరకు మాట్లాడుకుంటున్నారని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తేజను పిలిచి ఇంట్లోని స్పైసీ గాసిప్ చెప్పాలని అడగ్గా.. శోభా శెట్టి మీద గౌతమ్ కు పాజిటివ్ ఇంప్రెషన్ కలుగుతుందని అతను తనతో చెప్పినట్లు తెలిపారు. ఇక ఇదే విషయాన్ని బయటకు వచ్చాక శుభా శ్రీతో మాట్లాడాడు తేజ. మొత్తానికి షకీలా, తేజ ఇంట్లో ఉన్న గాసిప్స్ బయటపెట్టేశారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.