AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చిరునవ్వుతోనే భయపెడుతూ.. మాంత్రికుడిలా మారిపోయిన స్టార్‌ హీరో.. ఎవరో గుర్తుపట్టారా?

చిరునవ్వుతోనే భయపెడుతూ.. మాంత్రికుడిలా మారిపోయిన ఈ స్టార్‌ హీరోను గుర్తుపట్టారా?నటనకు డిక్షనరీ ఈ రూపం. సినిమా ఇండస్ట్రీలో ఆయననది 40 ఏళ్ల అనుభవం. తన వెర్సటైల్‌ యాక్టింగ్‌తో ఎలాంటి పాత్రలపైనా ప్రాణం పోస్తారాయన. అందుకే ఆయనకు ఎంతోమంది అభిమానులున్నారు. అలాగే తన నటనా ప్రతిభకు గుర్తింపుగా లెక్కలేనన్నీ అవార్డులు,ప్రశంసలు అందుకున్నారు. పేరుకు..

Tollywood: చిరునవ్వుతోనే భయపెడుతూ.. మాంత్రికుడిలా మారిపోయిన స్టార్‌ హీరో.. ఎవరో గుర్తుపట్టారా?
Senior Hero
Basha Shek
|

Updated on: Sep 08, 2023 | 4:09 PM

Share

చిరునవ్వుతోనే భయపెడుతూ.. మాంత్రికుడిలా మారిపోయిన ఈ స్టార్‌ హీరోను గుర్తుపట్టారా?నటనకు డిక్షనరీ ఈ రూపం. సినిమా ఇండస్ట్రీలో ఆయననది 40 ఏళ్ల అనుభవం. తన వెర్సటైల్‌ యాక్టింగ్‌తో ఎలాంటి పాత్రలపైనా ప్రాణం పోస్తారాయన. అందుకే ఆయనకు ఎంతోమంది అభిమానులున్నారు. అలాగే తన నటనా ప్రతిభకు గుర్తింపుగా లెక్కలేనన్నీ అవార్డులు,ప్రశంసలు అందుకున్నారు. పేరుకు మలయాళీనే అయినా.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సీనియర్‌ హీరో బాగా సుపరిచతం. హీరోగా పలు స్ట్రెయిట్‌ సినిమాల్లో నటించారు. అలాగే స్పెషల్‌ రోల్స్‌లోనూ సందడి చేశారు. ఇటీవలే పుట్టిన రోజు జరుపుకొన్న ఈ సీనియర్‌ హీరో తన కొత్త సినిమాను ప్రకటించారు. ఇందులో చిరునవ్వుతోనే కనిపిస్తూ అందరినీ భయపెట్టేశారాయన. మాంత్రికుడి గెటప్‌లో సరికొత్తగా కనిపించి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. మరీ ఇంతకీ ఈ వెర్సటైల్‌ యాక్టర్‌ఎవరో గుర్తుపట్టారా? కష్టంగా ఉందా? అయితే ఓ క్లూ.. కొన్ని నెలల క్రితం అక్కినేని అఖిల్‌తో కలిసి ఓ స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలో నటించాడీ మలయాళ స్టార్‌ హీరో. ఇప్పుడైనా గుర్తుపట్టారా? ఆయన మరెవరో కాదు మలయాళ సీనియర్‌ హీరో మమ్ముట్టి.

యాత్ర, ఏజెంట్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మమ్ముట్టి ఈ సారి మాంత్రికుడిగా మనల్ని భయపెట్టేందుకు వస్తున్నారు. ఆయన నటిస్తోన్న తాజా చిత్రం భ్ర‌మ‌యుగం. గతంలో భూతకాలం సినిమాతో అందరినీ ఆకట్టుకున్నరాహుల్ సదాశివన్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అర్జున్‌ అశోకన్‌, సిద్ధార్థ్‌, భరతన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మమ్ముట్టి పుట్టిన రోజు సందర్భంగా తాజాగా భ్రమయుగం నుంచి ఆయన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇందులో చిన్న చిరునవ్వుతోనే భయపెట్టించారాయన. ప్రస్తుతం మమ్ముట్టి పోస్ట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆయనకు జన్మదిను శుభాకాంక్షలు తెలుపుతూ, సినిమా సూపర్‌ హిట్‌ కావాలంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇక కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో భ్రమయుగం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

బ్రహ్మయుగం మూవీలో మమ్ముట్టి ఫస్ట్ లుక్ పోస్టర్

మమ్ముట్టి ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్

View this post on Instagram

A post shared by Mammootty (@mammootty)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి