AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD former AVSO: సతీష్‌కుమార్‌ డెత్‌ కేసులో పోలీసులకు ప్రశ్నల సవాళ్లు..

తిరుమల మాజీ విజిలెన్స్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ సతీష్‌కుమార్‌ డెత్‌ మిస్టరీగా మారుతోందా?.. ఒక్క మర్డర్‌.. పది అనుమానాలు అన్నట్లుగా పోలీసులకు సవాళ్లు విసురుతోందా?.. గుంతకల్‌ రైల్వేస్టేషన్‌లో అర్ధరాత్రి ఒంటి గంటకు ట్రైన్‌ ఎక్కిన సతీష్‌కుమార్‌.. ఒంటి గంటా 20నిమిషాలకు డిస్‌ కంఫర్ట్‌గా ఉందని తన భార్యకు ఎందుకు మెసెజ్‌ పెట్టాడు?.. 70అడుగుల దూరంలో డెడ్‌ బాడీ పడితే.. మొబైల్‌ ఎందుకు దెబ్బతినలేదు?.. మర్డర్‌ కేసు నమోదు చేశారు సరే.. హత్య చేసిందెరు?.. సీన్‌రీకన్‌స్ట్రక్షన్‌లో పోలీసులు ఏం తేల్చారు?...

TTD former AVSO: సతీష్‌కుమార్‌ డెత్‌ కేసులో పోలీసులకు ప్రశ్నల సవాళ్లు..
Sathish Kumar
J Y Nagi Reddy
| Edited By: Ram Naramaneni|

Updated on: Nov 15, 2025 | 8:19 PM

Share

తిరుమల పరకామణి కేసులో కీలక వ్యక్తి.. టీటీడీ మాజీ AVSO సతీష్‌కుమార్ మృతిపై అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముందుగా సస్పెక్ట్‌ డెత్‌ అని భావించిన పోలీసులు.. ఆ తర్వాత.. స్పాట్‌లోని పరిస్థితులు.. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో హత్య కేసుగా నమోదు చేశారు. ఆ తర్వాత.. గుంతకల్‌ రైల్వే పోలీసుల నుంచి తాడిపత్రి పీఎస్‌కు కేసు ట్రాన్సఫర్‌ అవడంతో వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో సీసీ ఫుటేజ్‌ కూడా కీలకంగా మారింది. గురువారం రాత్రి 11 గంటల 50 నిమిషాలకు సతీష్‌కుమార్.. గుంతకల్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకోగా.. అక్కడే బైక్ పార్క్ చేసిట్లు సీసీ ఫుటేజ్‌లో కనిపిస్తోంది. దీంతో.. రైల్వేస్టేషన్ పార్కింగ్‌లో ఉన్న ఆయన బైక్‌ను గుర్తించారు. బైక్ పార్క్ చేసిన తర్వాత అర్థరాత్రి ఒంటి గంటకు గుంతకల్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎక్కినట్లు తేల్చిన పోలీసులు.. ఆ ట్రైన్‌లోని ఎవిడెన్స్ సేకరించే పనిలో పడ్డారు. ట్రైన్‌లో సెక్యూరిటీగా ఉండే RPF పోలీసులను ప్రశ్నించారు.

రాయలసీమ ఎక్స్‌ప్రెస్ A1 బోగిలో సతీష్‌కుమార్‌ ప్రయాణం

సతీష్‌కుమార్‌.. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ A1 బోగిలో ప్రయాణించారు. బోగీలోని ప్రయాణికుల లిస్ట్‌ ఆధారంగానూ దర్యాప్తు చేస్తున్నారు. దీంతోపాటు.. A1 బోగి CTE అప్పారావును తిరుపతి రైల్వే స్టేషన్‌లో జీఆర్పీ డీఎస్పీ హర్షిత ఆధ్వర్యంలో విచారించారు. సతీష్‌కుమార్ ట్రైన్ ఎక్కడ ఎక్కాడు?.. బోగిలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు?.. అనుమానితులను చూశారా?.. అన్న కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేశారు. శబ్ధం ఏమైనా వచ్చిందా?.. రైలు బోగిలోనే హత్య జరిగి ఉంటే తిరుపతికి చేరుకున్న రైలులో రక్తపు మరకలు ఏమైనా గుర్తించారా అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నారు. మరోవైపు.. సీసీ ఫుటేజ్‌లో సతీష్‌కుమార్‌ దగ్గర వైట్‌ బ్యాగ్‌ ఉంది. మరి.. రైలు బోగిలో ఆయన లగేజ్ ఏమైంది?.. రైలు బోగిని శుభ్రం చేసే టైమ్‌లో లగేజ్ ఉందా?.. లేదా?.. అనే అంశాలపైనా పోలీసులు ఫోకస్‌ పెట్టారు. అంతేకాదు.. సతీష్‌ రివాల్వార్ ఎక్కడుంది?.. అనే మరో కీలక అంశాన్ని దర్యాప్తు చేస్తున్నారు.

అర్ధరాత్రి 1.20ని.లకు భార్యకు సతీష్ 4సార్లు ఫోన్‌

సతీష్‌కుమార్‌ డెత్‌ మిస్టరీలో మరికొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం అర్థరాత్రి ఒంటి సమయంలో ట్రైన్‌ ఎక్కిన సతీష్‌కుమార్.. ఒంటి గంటా 20నిమిషాలకు తన భార్యకు నాలుగు సార్లు ఫోన్‌ చేశాడు. ఆమె ఫోన్‌ లిఫ్ట్‌ చేయపోవడంతో డిస్‌కంఫర్ట్‌గా ఉన్నట్లు ఇంగ్లీష్‌లో మెసెజ్‌ పెట్టేసాడు. ఆ తర్వాత.. 2 నుంచి 3గంటల సమయంలో ఘటన జరిగినట్లు పోస్టుమార్టం రిపోర్ట్‌లో వెల్లడైంది. అయితే.. సతీష్‌కుమార్‌ డెడ్‌బాడీ 70అడుగులు దూరంలో పడి ఉన్నప్పుడు.. అతని ఫోన్‌ కూడా ఎంతో కొంత దెబ్బతినాలి.. కానీ.. ఎలాంటి చెక్కుచెదరకుండా ఉండడం మరింత అనుమానాలకు తావిస్తోంది.

సతీష్‌కుమార్‌ మృతిపై పలు అనుమానాల నేపథ్యంలో ఘటనాస్థలంలో సీన్‌రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు పోలీసులు. సతీష్‌కుమార్‌ బరువుతో సమానమైన ఓ బొమ్మను చెన్నై ఎగ్మోర్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ నుంచి విసిరారు. సతీష్‌కుమార్‌ డెడ్‌బాడీ 70అడుగుల దూరంలో ఉండడంపై.. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌తో వెరిఫై చేశారు. మొత్తంగా.. ఒక్క మర్డర్‌లో.. పలు రకాల అనుమానాలు పోలీసులకు సవాళ్లుగా మారిన నేపథ్యంలో విచారణలో ఏం తేలనుందో చూడాలి..

కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్
అంజీర పండ్లు శాఖాహారమా లేక మాంసాహారమా? తినే ముందు ఇది తెలుసుకోండి
అంజీర పండ్లు శాఖాహారమా లేక మాంసాహారమా? తినే ముందు ఇది తెలుసుకోండి
ప్రభాస్, నానిలాంటి హీరోలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది
ప్రభాస్, నానిలాంటి హీరోలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది
ఫ్లిప్‌కార్ట్ బై బైలో సేల్‌లో హెయిర్‌ డ్రైయర్లపై భారీ డిస్కౌంట్‌
ఫ్లిప్‌కార్ట్ బై బైలో సేల్‌లో హెయిర్‌ డ్రైయర్లపై భారీ డిస్కౌంట్‌
సూర్యకాంతి లేకున్నా ఇంట్లో పెంచదగిన అద్భుతమైన మొక్కలు!
సూర్యకాంతి లేకున్నా ఇంట్లో పెంచదగిన అద్భుతమైన మొక్కలు!
వెనక్కి నడిస్తే ఆరోగ్యంలో ముందడుగు వేసినట్టేనని తెలుసా?
వెనక్కి నడిస్తే ఆరోగ్యంలో ముందడుగు వేసినట్టేనని తెలుసా?
ఈ ఉప్పు కిలో ధర తెలిస్తే కోటీశ్వరుడికైనా చెమటలు పడతాయి
ఈ ఉప్పు కిలో ధర తెలిస్తే కోటీశ్వరుడికైనా చెమటలు పడతాయి
మొదటి సినిమాతోనే నాగ్‌తో పోటీ పడిన కామెడీ హీరో
మొదటి సినిమాతోనే నాగ్‌తో పోటీ పడిన కామెడీ హీరో
16 అంతస్థుల రైల్వే స్టేషన్.. దేశంలోనే ఫస్ట్.. దీన్ని ప్రత్యేకతలు
16 అంతస్థుల రైల్వే స్టేషన్.. దేశంలోనే ఫస్ట్.. దీన్ని ప్రత్యేకతలు
స్వచ్చమైన గాలికోసం ఎయిర్​ ఫ్యూరిఫైయర్లు వాడవచ్చా?
స్వచ్చమైన గాలికోసం ఎయిర్​ ఫ్యూరిఫైయర్లు వాడవచ్చా?