AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CII సదస్సుకు ఓ రేంజ్‌లో స్పందన.. అంచనాలకు మించి పెట్టుబడుల వెల్లువ..!

విశాఖ సీఐఐ సదస్సు సూపర్ సక్సెస్ అయిందంటే.. దానికి కొన్ని నెలలపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన కృషే కారణం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌తో పాటు మిగిలిన మంత్రులు పట్టువదలకుండా చేసిన ప్రయత్నాలు.. దేశ విదేశాలు తిరిగి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవడంతోనే ఇది సాధ్యమైంది. అన్నింటికీ మించి.. ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు, పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహకాల కారణంగా.. అసాధ్యం, సుసాధ్యమైంది.

CII సదస్సుకు ఓ రేంజ్‌లో స్పందన.. అంచనాలకు మించి పెట్టుబడుల వెల్లువ..!
Cii Partnership Summit In Visakhapatnam
Balaraju Goud
|

Updated on: Nov 15, 2025 | 8:15 PM

Share

విశాఖ సీఐఐ సదస్సు సూపర్ సక్సెస్ అయిందంటే.. దానికి కొన్ని నెలలపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన కృషే కారణం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌తో పాటు మిగిలిన మంత్రులు పట్టువదలకుండా చేసిన ప్రయత్నాలు.. దేశ విదేశాలు తిరిగి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవడంతోనే ఇది సాధ్యమైంది. అన్నింటికీ మించి.. ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు, పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహకాల కారణంగా.. అసాధ్యం, సుసాధ్యమైంది.

కంపెనీలను తీసుకురావాలి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలి. రాష్ట్రాన్ని డబుల్ ఇంజన్ స్పీడ్‌తో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పెట్టుబడుల సదస్సు ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ సదస్సులో పారిశ్రామికవేత్తల నుంచి ఓ రేంజ్‌లో స్పందన వచ్చింది. పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి. పెద్ద ఎత్తున క్యూ కట్టిన కంపెనీలు.. అంచనాలకు మించి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. సదస్సు ప్రారంభానికి ముందే సీఎంతో పాటు మంత్రులను కలిసి ఒప్పందాలు చేసుకున్నాయి.. పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు.

విశాఖ భాగస్వామ్య సదస్సులో భాగంగా తొలిరోజే 400 కంపెనీలతో ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది. ఆయా కంపెనీలు పెట్టబోతున్న పెట్టుబడుల విలువ ఎంతో తెలుసా…? అక్షరాలా.. 11లక్షల 91 వేల 972 కోట్ల రూపాయలు. ఈ పెట్టుబడుల ద్వారా 13లక్షల 32వేల 445 మందికి ఉపాధి లభించబోతోంది. వాస్తవానికి శుక్రవారం (నవంబర్ 14) నుంచి CII సదస్సు. కానీ.. ఒకరోజు ముందే.. అంటే గురువారమే రూ. 3లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. శుక్రవారం ఒక్కరోజే 365 కంపెనీలతో 8లక్షల 26 వేల 668 కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం అవగాహనా ఒప్పందాలు చేసుకుంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో 41 ఒప్పందాలు జరగ్గా, మంత్రుల ఆధ్వర్యంలో మరో 324 ఒప్పందాలు కుదిరాయి. మంత్రి నారా లోకేశ్ లక్షా 38 వేల 752 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు చేసుకోగా.. మిగిలిన మంత్రులు కూడా భారీ ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా 12 లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తుంది.

గురువారం, శుక్రవారం జరిగిన ఒప్పందాల్లో మొత్తం ఏడు రంగాల్లో పెట్టుబడులు వచ్చాయి. అత్యధికంగా వాణిజ్యం, పరిశ్రమల రంగంలో 121 ఒప్పందాలు జరిగాయి. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో 95 ఒప్పందాలు.. విద్యుత్ రంగంలో 44 ఒప్పందాలు కుదిరాయి. విద్యుత్ రంగంలో రాబోతోన్న 5లక్షల 11వేల 502 కోట్ల పెట్టుబడులతో 2లక్షల 45వేల 222 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఐఅండ్ఐ విభాగంలో 2 లక్షల 5 వేల 8 కోట్ల పెట్టుబడులతో 3 లక్షల 5 వేల 574 మందికి ఉద్యోగాలు వస్తాయి. CRDAలో 50 వేల 511 కోట్ల పెట్టుబడులతో 42వేల 225 మందికి ఉద్యోగాలు.. మున్సిపల్‌శాఖలో 4వేల 944 కోట్ల పెట్టుబడులతో 12 వేల 150 మందికి ఉద్యోగాలు.. ఫుడ్ ప్రాసెసింగ్‌లో 13 వేల 9 కోట్ల పెట్టుబడులతో 47 వేల 390 మందికి ఉద్యోగాలు.. పరిశ్రమలు మరియు వాణిజ్యంలో 2లక్షల 68వేల 248 కోట్ల పెట్టుబడులతో 4లక్షల 23వేల 869 మందికి ఉద్యోగాలు.. I.Tలో లక్షా 38వేల 752 కోట్ల పెట్టుబడులతో 2లక్షల 56వేల 15 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి.

లక్షా పది వేల కోట్లతో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో రిలయన్స్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయబోతోంది. రెండు లక్షల 16 కోట్ల పెట్టుబడులకు బ్రూక్‌ఫీల్డ్‌ ఒప్పందం చేసుకుంది. వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్‌ ఏర్పాటుతో పాటు లక్షా 10 వేల కోట్లతో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకొచ్చింది. పోర్టులు, లాజిస్టిక్స్, పునరుత్పాదక విద్యుత్తు రంగాల్లో అదానీ సంస్థ ఇప్పటికే 40 వేల కోట్ల పెట్టుబడి పెట్టింది. లక్ష ఉద్యోగాలు కల్పించింది. రాబోయే పదేళ్లలో పోర్టులు, డేటా సెంటర్, సిమెంట్‌ రంగాల్లో మరో లక్ష కోట్ల పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్టు అదానీ సంస్థ ప్రకటించింది.

విమానయాన రంగంలోనూ లక్షా 91వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాల్లో స్పేస్‌సిటీతో పాటు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్‌సిటీకి వర్చువల్‌గా చంద్రబాబు శంకుస్థాపన చేశారు. స్పేస్ సిటీలో వచ్చే పదేళ్లలో 25 వేల కోట్ల పెట్టుబడులు, 35 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఓర్వకల్లులో 300 ఎకరాల్లో ఏర్పాటు చేసే డ్రోన్‌సిటీలో అధునాతన తయారీ పార్కులు, టెస్టింగ్, సర్టిఫికేషన్‌ ద్వారా 25 వేల మందికి శిక్షణ అందించబోతోంది ప్రభుత్వం. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి లభిస్తుంది.

ఏఎం గ్రీన్ మెటల్స్ & మెటీరియల్స్ 40 వేల కోట్ల పెట్టుబడులు పెడుతోంది. కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడలో గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తుందీ సంస్థ. మరో పది వేల కోట్లతో శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో సెకండ్‌ జనరేషన్‌ ఇథనాల్‌ బయో రిఫైనరీ పరిశ్రమలు పెట్టేందుకు ఈ సంస్థ సిద్ధమైంది. రిలయన్స్, టాటా పవర్, ఎస్సార్ రెన్యువబుల్స్, జీఎంఆర్ ఎనర్జీ, జాక్సన్ గ్రీన్, ఎకోరెన్ ఎనర్జీ వంటి దిగ్గజ సంస్థలతో భారీ ఒప్పందాలు కుదిరాయి. గోద్రెజ్ ఆగ్రో వెట్.. 70 కోట్లతో పాడి పరిశ్రమ విస్తరణ, ఆయిల్‌పామ్ రైతులకు మేలు చేసేలా రాష్ట్రంలో ఐదు సమాధాన్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతోంది. సిప్సా టెక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ 11 వందల 40 కోట్లతో తిరుపతికి దగ్గరలో ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 15 వందల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. 2027 నాటికి ఉత్పత్తి ప్రారంభం ఈ సంస్థ లక్ష్యం.

ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో సంస్థలు ఏపీకి క్యూ కట్టాయి. వాటిల్లో చాలా సంస్థలు రెండు నుంచి మూడేళ్లలో మొదటి దశ పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇవన్నీ కార్యరూపం దాల్చితే.. ఎన్నికల్లో చెప్పిన సంపద సృష్టి, 20లక్షల ఉద్యోగాల లక్ష్యం నెరవేరినట్టేనని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్
అంజీర పండ్లు శాఖాహారమా లేక మాంసాహారమా? తినే ముందు ఇది తెలుసుకోండి
అంజీర పండ్లు శాఖాహారమా లేక మాంసాహారమా? తినే ముందు ఇది తెలుసుకోండి
ప్రభాస్, నానిలాంటి హీరోలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది
ప్రభాస్, నానిలాంటి హీరోలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది
ఫ్లిప్‌కార్ట్ బై బైలో సేల్‌లో హెయిర్‌ డ్రైయర్లపై భారీ డిస్కౌంట్‌
ఫ్లిప్‌కార్ట్ బై బైలో సేల్‌లో హెయిర్‌ డ్రైయర్లపై భారీ డిస్కౌంట్‌
సూర్యకాంతి లేకున్నా ఇంట్లో పెంచదగిన అద్భుతమైన మొక్కలు!
సూర్యకాంతి లేకున్నా ఇంట్లో పెంచదగిన అద్భుతమైన మొక్కలు!
వెనక్కి నడిస్తే ఆరోగ్యంలో ముందడుగు వేసినట్టేనని తెలుసా?
వెనక్కి నడిస్తే ఆరోగ్యంలో ముందడుగు వేసినట్టేనని తెలుసా?
ఈ ఉప్పు కిలో ధర తెలిస్తే కోటీశ్వరుడికైనా చెమటలు పడతాయి
ఈ ఉప్పు కిలో ధర తెలిస్తే కోటీశ్వరుడికైనా చెమటలు పడతాయి
మొదటి సినిమాతోనే నాగ్‌తో పోటీ పడిన కామెడీ హీరో
మొదటి సినిమాతోనే నాగ్‌తో పోటీ పడిన కామెడీ హీరో