AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో 10గ్రాముల ధర ఎంతుందంటే..

ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే.. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో లక్షా 30 వేల మార్క్ దాటిన బంగారం ధరలు .. ఆ తర్వాత దాదాపు 10 వేల వరకు తగ్గాయి. తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరిగాయి.. ఈ క్రమంలోనే.. గత రెండు రోజులుగా బంగారం వెండి ధరలు తగ్గుతున్నాయి.

Gold Price Today: బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో 10గ్రాముల ధర ఎంతుందంటే..
Gold Price
Shaik Madar Saheb
|

Updated on: Nov 17, 2025 | 6:25 AM

Share

ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే.. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో లక్షా 30 వేల మార్క్ దాటిన బంగారం ధరలు .. ఆ తర్వాత దాదాపు 10 వేల వరకు తగ్గాయి. తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరిగాయి.. ఈ క్రమంలోనే.. గత రెండు రోజులుగా బంగారం వెండి ధరలు తగ్గుతున్నాయి. శనివారం 10 గ్రాముల బంగారం పై ఏకంగా 2 వేల వరకు ధర తగ్గింది.. వెండి కూడా కిలో పై రూ.4వేల వరకు ధర తగ్గింది. వాస్తవానికి బంగారం, వెండి ధరల్లో నిత్యం హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటాయి.. ఒక్కో రోజు బంగారం, వెండి ధర పెరిగితే.. మరికొన్ని రోజులు తగ్గుతుంటాయి.. తాజాగా.. ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. ఆదివారం (నవంబర్ 16 2025) ఉదయం నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి..

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,25,080 గా ఉంది.

22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,14,650 గా ఉంది.

వెండి కిలో రూ.1,69,000 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,080 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.1,14,650 ఉంది.. కిలో వెండి ధర రూ.1,75,000 లుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,25,080, 22 క్యారెట్ల ధర రూ.1,14,650 గా ఉంది.. కిలో వెండి ధర రూ.1,75,000 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,25,230, 22 క్యారెట్లు రూ.1,14,800 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,69,000లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,25,080, 22 క్యారెట్లు రూ.1,14,650 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,69,000 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,26,000, 22 క్యారెట్ల ధర రూ.1,15,500 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,75,000లుగా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,25,080, 22 క్యారెట్ల ధర రూ.1,14,650 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,69,000 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
విష్ణు విన్యాసం మూవీ రివ్యూ.. శ్రీ విష్ణ మరోసారి నవ్వించాడా లేదా.
విష్ణు విన్యాసం మూవీ రివ్యూ.. శ్రీ విష్ణ మరోసారి నవ్వించాడా లేదా.
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
మీరు బుక్ చేసుకున్న సీట్లో వేరేవాళ్లు కూర్చున్నారా?.. ఇలా చేయండి
మీరు బుక్ చేసుకున్న సీట్లో వేరేవాళ్లు కూర్చున్నారా?.. ఇలా చేయండి
ఏపీలో వీరికి ప్రతీ నెలా రూ.1,750.. దరఖాస్తు చేసుకోండి
ఏపీలో వీరికి ప్రతీ నెలా రూ.1,750.. దరఖాస్తు చేసుకోండి
ఎటు పోతుందిరా సమాజం.. చికెన్ కోసం సొంత తమ్ముడినే దారుణంగా..
ఎటు పోతుందిరా సమాజం.. చికెన్ కోసం సొంత తమ్ముడినే దారుణంగా..
అప్పుడే పుట్టిన ఈ బుడ్డోడి బరవు తెలిస్తే మైండ్ బ్లాక్..!
అప్పుడే పుట్టిన ఈ బుడ్డోడి బరవు తెలిస్తే మైండ్ బ్లాక్..!
ఇలా చేస్తే ఉదయం వేళల్లో 2 నిమిషాల్లోనే బ్రేక్‌ ఫాస్ట్‌ రెడీ..
ఇలా చేస్తే ఉదయం వేళల్లో 2 నిమిషాల్లోనే బ్రేక్‌ ఫాస్ట్‌ రెడీ..
IPLలో సెన్సేషన్.. హీరోయిన్ జూహీ చావ్లా కూతురిని చూశారా.. ?
IPLలో సెన్సేషన్.. హీరోయిన్ జూహీ చావ్లా కూతురిని చూశారా.. ?
క్షమించు ఆయేషా.. కాసిన్ని కన్నీళ్లు తప్ప నీకు ఏం ఇవ్వలేకపోయాం..
క్షమించు ఆయేషా.. కాసిన్ని కన్నీళ్లు తప్ప నీకు ఏం ఇవ్వలేకపోయాం..