Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బావిలో పడిన పిల్లిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్‌.. ఫైర్లింజన్లతో నీటిని తోడి.. రోజంతా శ్రమించి.. చివరకు..

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి ఎంత ఖర్చయినా, ఎంత రిస్క్ అయినా ప్రాణ మరియు ఆస్తులను కాపాడతారు. అంత వరకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ జిల్లాలో అగ్నిమాపక సిబ్బంది మాత్రం మనుషుల ప్రాణాలే కాదు, తమకు ప్రాణాలున్న ప్రతి జీవిని కాపాడటం ధర్మమే అంటూ నడుము బిగించారు. ఓ పిల్లిని కాపాడేందుకు వేగవంతంగా సాగిన అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చూసిన స్థానికులు అబ్బురపడి శభాష్ అంటూ ప్రశంసించారు.

బావిలో పడిన పిల్లిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్‌.. ఫైర్లింజన్లతో నీటిని తోడి.. రోజంతా శ్రమించి.. చివరకు..
Cat Rescue Operation
Follow us
G Koteswara Rao

| Edited By: Basha Shek

Updated on: Aug 13, 2023 | 6:45 AM

విజయనగరం న్యూస్‌, ఆగస్టు 12: ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి ఎంత ఖర్చయినా, ఎంత రిస్క్ అయినా ప్రాణ మరియు ఆస్తులను కాపాడతారు. అంత వరకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ జిల్లాలో అగ్నిమాపక సిబ్బంది మాత్రం మనుషుల ప్రాణాలే కాదు, తమకు ప్రాణాలున్న ప్రతి జీవిని కాపాడటం ధర్మమే అంటూ నడుము బిగించారు. ఓ పిల్లిని కాపాడేందుకు వేగవంతంగా సాగిన అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చూసిన స్థానికులు అబ్బురపడి శభాష్ అంటూ ప్రశంసించారు. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు ప్రశంసించారు అనుకుంటున్నారా? తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గరుగుబిల్లి మండలం చినగుడబ సమీపంలో ఓ పిల్లి ప్రమాదవశాత్తు ఓ నేల బావిలో పడింది. పిల్లి నూతిలో పడటం చూసిన ఓ పశువుల కాపరి పిల్లి నూతిలో పడింది.. ఏదో ఒక ఇబ్బంది పడి నూతి నుండి అదే బయటపడుతుందిలే అనుకొని సాయంత్రం ఇంటికి వెళ్లిపోయాడు. ఎప్పటిలాగే మరుసటి రోజు మళ్లీ పశువులతో వచ్చిన పశువుల కాపరి పిల్లి కోసం నూతిలో చూడగా పిల్లి బయటకు వచ్చేందుకు అనేక అగచాట్లు పడుతూ కనిపించింది. అలా సుమారు ఇరవై నాలుగు గంటలకు పైగానే నూతిలో నుండి పిల్లి బయటకు రావడానికి నానా అవస్థలు పడింది. అయినా ఫలితం దక్కలేదు. ఇదంతా గమనించిన పశువుల కాపరి తన వంతు పిల్లిని కాపాడేందుకు ప్రయత్నించాడు. అయినా కుదరలేదు. ఇక చేసేదిలేక స్థానికుల సహాయంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చాడు పశువుల కాపరి. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీమ్ వెంటనే రంగంలోకి దిగారు. ముందుగా కర్రల సహాయంతో పిల్లిని బయటకు తీసేందుకు శత విధాల ప్రయత్నించినా ఫలితం లేదు.

ఇక చేసేది లేక తమ ఫైరింజన్లను రంగంలోకి దించారు. నూతిలో ఉన్న నీటిని తోడేందుకు సుమారు నాలుగు గంటలు నాన్ స్టాఫ్ గా పనిచేశారు. నూతిలో నీరు అంతా అయిపోయిన తరువాత సిబ్బంది నూతిలోకి దిగి జాగ్రతగా పిల్లిని బయటకు తీశారు. అప్పటికే పిల్లి బాగా అలిసిపోయి నీరసంగా ఉంది. రెస్క్యూ టీమ్ తో పాటు పెద్దఎత్తున ఉన్న స్థానికులను చూసిన పిల్లి భయంతో వణికి పోతుంది. వెంటనే పిల్లి ని వెటర్నరీ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు అధికారులు. పిల్లి కొంత రికవరీ అయిన తరువాత దగ్గరలో ఉన్న అడవిలో వదిలేసి తమ భాధ్యత సక్రమంగా నిర్వర్తించి ఆనందాన్ని వ్యక్తం చేశారు రెస్క్యూ టీమ్. అయితే పిల్లి కోసం ఒక రోజు సమయం వెచ్చించి సుమారు ఇరవై వేలకు పైగా సొంత నిధులను ఖర్చు చేశారు అగ్నిమాపక సిబ్బంది. ఇదంతా ఆసక్తిగా చూసిన పరిసర గ్రామాల ప్రజలు అగ్నిమాపక సిబ్బంది మానవత్వం, చొరవ చూసి రెస్క్యూ టీమ్ ను అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..