Aakhri Sach OTT: ఆ 11 చావులకు కారణమెవరు? తమన్నా క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌.. ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడుంటే?

ఈసారి చాలా డిఫరెంట్‌గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపించనుంది.  ఆమె నటించిన తాజా వెబ్‌ సిరీస్‌ ఆఖరి సచ్‌. తాజాగా ఈ సిరీస్‌ ట్రైలర్‌ రిలీజైంది. ఢిల్లీలోని ఒక కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పదంగా చనిపోతారు. 9 నుంచి 71 ఏళ్ల మధ్య ఉన్న మూడుతరాలకు చెందిన కుటుంబీకులు అంతా మూకుమ్మడిగా ఉరేసుకుంటారు. అయితే అవి ఆత్మహత్యలా? హత్యలా? లేకుంటే ఎవరైనా వారిని బలిదానాలకు ప్రేరేపించారా? అని తెలుసుకునేందుకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా రంగంలోకి దిగుతుంది తమన్నా.

Aakhri Sach OTT: ఆ 11 చావులకు కారణమెవరు? తమన్నా క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌.. ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడుంటే?
Aakhri Sach Web Series
Follow us
Basha Shek

|

Updated on: Aug 12, 2023 | 6:30 AM

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం బిజీబిజీగా ఉంటోంది. నెలకో సినిమా, వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ వారంలో తమన్నా నటించిన రెండు భారీ చిత్రాలు థియేటర్లో రిలీజయ్యాయి. రజనీకాంత్‌తో నటించిన జైలర్‌, మెగాస్టార్‌ చిరంజీవితో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న భోళాశంకర్‌ సినిమాలు రెండూ పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళుతున్నాయి. అంతకుముందు జీ కర్దా, లస్ట్ స్టోరీస్‌ వంటి వెబ్‌ సిరీస్‌లతో ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించింది. ఇప్పుడు మరో సిరీస్‌తో మన ముందుకు రానుంది తమన్నా . అయితే ఈసారి చాలా డిఫరెంట్‌గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపించనుంది.  ఆమె నటించిన తాజా వెబ్‌ సిరీస్‌ ఆఖరి సచ్‌. తాజాగా ఈ సిరీస్‌ ట్రైలర్‌ రిలీజైంది. ఢిల్లీలోని ఒక కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పదంగా చనిపోతారు. 9 నుంచి 71 ఏళ్ల మధ్య ఉన్న మూడుతరాలకు చెందిన కుటుంబీకులు అంతా మూకుమ్మడిగా ఉరేసుకుంటారు. అయితే అవి ఆత్మహత్యలా? హత్యలా? లేకుంటే ఎవరైనా వారిని బలిదానాలకు ప్రేరేపించారా? అని తెలుసుకునేందుకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా రంగంలోకి దిగుతుంది తమన్నా. విచారణంలో అంతులేని చిక్కులు, ప్రశ్నలు ఎదురవుతాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఆఖరి సచ్‌ సిరీస్‌ ఆగస్టు 25న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌.

2018లో దేశ రాజధాని ఢిల్లీలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పందంగా చనిపోయారు. ఇప్పుడు ఈ నిజజీవిత సంఘటన ఆదారంగానే ఆఖరి సచ్‌ వెబ్‌ సిరీస్‌ రూపొందించారని తెలుస్తోంది.  రాబీ గ్రేవెల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు సౌరవ్ దేవ్ కథను అందించారు. నిర్వికార్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ లో తమన్నాతో పాటు అభిషేక్ బెనర్జీ, శివిన్ నారంగ్, దనిష్ ఇక్బాల్, నిషూ దీక్షిత్, క్రితి విజ్, సంజీవ్ చోప్రా కీలక పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

ఆఖరి సచ్ వెబ్ సిరీస్ ట్రైలర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!