Padmini OTT: భార్య ప్రేమించిన వాడితో వెళ్లిపోతే.. ఓటీటీలో అలరిస్తోన్న ‘పద్మిని’.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కొన్ని రోజుల క్రితం వచ్చిన 2018, లేటెస్ట్‌గా వచ్చిన నెయ్‌మార్‌ సినిమాలకు ఓటీటీలో భారీ రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా మరో మలయాళ సూపర్‌ హిట్‌ సినిమా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి అందుబాటులోకి వచ్చింది. కున్‌చకో బొబన్‌ హీరోగా తెరకెక్కిన పద్మిని సినిమా ఈ ఏడాది జులై 14న మలయాళంలో థియేటర్లలో విడుదలైంది. సెన్నా హెగ్డే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అప‌ర్ణా బాల‌ముర‌ళి, మడోన్నా సెబాస్టియన్‌, విన్సీ అలోషియస్‌, మాళవిక మేనన్‌, సజిన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Padmini OTT: భార్య ప్రేమించిన వాడితో వెళ్లిపోతే.. ఓటీటీలో అలరిస్తోన్న ‘పద్మిని’.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Padmini Movie
Follow us
Basha Shek

|

Updated on: Aug 12, 2023 | 6:15 AM

ఇటీవల పలు మలయాళ సినిమాలు తెలుగులోకి డబ్‌ అవుతున్నాయి. కొన్ని థియేటర్లలో రిలీజైతే, మరికొన్ని నేరుగా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఆసక్తికరమైన కథా, కథనాలు ఎంతో హృద్యంగా తెరకెక్కుతోన్న ఈ మలయాళ మూవీస్‌ తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఓటీటీల్లో ఈ సినిమాలకు భారీగా ఆదరణ దక్కుతోంది. అందుకు తగ్గట్టే పలు ఓటీటీ సంస్థలు మలయాళ హిట్‌ సినిమాలను ఇక్కడి ప్రేక్షకులకు అనుగుణంగా తెలుగులో డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వచ్చిన 2018, లేటెస్ట్‌గా వచ్చిన నెయ్‌మార్‌ సినిమాలకు ఓటీటీలో భారీ రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా మరో మలయాళ సూపర్‌ హిట్‌ సినిమా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి అందుబాటులోకి వచ్చింది. కున్‌చకో బొబన్‌ హీరోగా తెరకెక్కిన పద్మిని సినిమా ఈ ఏడాది జులై 14న మలయాళంలో థియేటర్లలో విడుదలైంది. సెన్నా హెగ్డే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అప‌ర్ణా బాల‌ముర‌ళి, మడోన్నా సెబాస్టియన్‌, విన్సీ అలోషియస్‌, మాళవిక మేనన్‌, సజిన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కొంత డ్రామా, కొంత కామెడీ మిక్స్‌ చేసి రూపొందిన పద్మిని సినిమా మలయాళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో శుక్రవారం (ఆగస్టు 11) నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

పద్మిని కథ విషయానికొస్తే..

హీరో రమేశ్‌ (కున్‌చ‌కో బొబన్‌) ఓ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తుంటాడు. సమయం దొరికినప్పుడల్లా కథలు కూడా రాస్తుంటాడు. ఎన్నో ఆశలు, కలలతో వైవాహిక బంధంలోకి అడుగుపెడతాడు. అయితే మొదటి రాత్రే అతని భార్య ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతుంది. దీంతో అతనికి రెండో వివాహం చేయాలని తల్లిదండ్రులు అనుకుంటారు. రమేశ్‌ కూడా అంగీకరించడంతో పెళ్లి చూపులు మొదలెడతారు. అయితే అధికారికంగా విడాకులు మంజూరైతేనే రమేశ్‌కు తమ అమ్మాయిని ఇస్తామంటూ నిబంధనలు విధిస్తారు. మరి ఎక్కడికెళ్లిందో తెలియని భార్యను రమేశ్‌ ఎలా వెతికిపట్టుకున్నాడు? లాయర్‌ (అపర్ణా బాలమురళి) రమేష్‌కు ఎలా సాయం చేసింది. అతను రెండో వివాహం చేసుకున్నాడా? అసలు ఈ కథలో పద్మిని ఎవరో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే మరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..