Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: చిరుత దాడి నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం.. ఇకపై కాలినడక మార్గంలో..

ఏడో మైలురాయి నుంచి నరసింహస్వామి ఆలయం వరకు సెక్యూరిటీ డబుల్‌ చేసింది. ఇకపై ప్రతి 40 అడుగులకు ఒక్కో టీమ్‌ భక్తుల భద్రతను పర్యవేక్షించనుంది. అంతేకాదు, ఇప్పటివరకు 50మందిని ఒక గుంపుగా పంపితే, ఇప్పట్నుంచి 100మంది ఉంటేనే పంపించనున్నారు. అనుమానమే నిజమైంది, నిర్లక్ష్యమే బలి తీసుకుంది, అవును ముమ్మాటికీ నిర్లక్ష్యమే చిన్నారి లక్షిత ప్రాణాలను తీసేసింది. సరిగ్గా 50రోజులక్రితం ఇదే అలిపిరి నడకదారిలో ఐదేళ్ల పిల్లాడు కౌశిక్‌పై చిరుత ఎటాక్‌ జరిగింది. తాత చేయి పట్టుకొని నడివెళ్తోన్న కౌశిక్‌పై అమాంతం దాడిచేసి అడవిలోకి ఎత్తుకుపోయింది...

TTD: చిరుత దాడి నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం.. ఇకపై కాలినడక మార్గంలో..
TTD News
Follow us
Narender Vaitla

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 13, 2023 | 3:08 PM

తిరుమలలో కాలి నడక మార్గంలో చిరుత దాడిలో ఆరేళ్ల బాలిక మృతి చెందిన ఘటన ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కాలినడకన తిరుమలకు వెళ్తున్న సమయంలో లక్షిత అదృశ్యమైంది. దీంతో గాలింపు చర్యలు మొదలు పెట్టిన అధికారులకు శనివారం ఉదయం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వద్ద బాలిక మృత దేహం గుర్తించారు. దీంతో, తిరుమల పరిసరాల్లో విషాదం నెలకొంది. ఇదిలా ఉంటే లక్షిత మృతితో అలెర్ట్‌ అయిన టీటీడీ కొత్త ప్రతిపాదనలు రూపొందిస్తోంది. నడక మార్గాల్లో మరింత భద్రత పెంచాలని నిర్ణయించింది. సాయంత్రం 6 తర్వాత నడక మార్గాలను మూసివేసే అంశంపై చర్చలు జరుపుతోంది.

మరోవైపు టీటీడీ.. ఏడో మైలురాయి నుంచి నరసింహస్వామి ఆలయం వరకు సెక్యూరిటీ డబుల్‌ చేసింది. ఇకపై ప్రతి 40 అడుగులకు ఒక్కో టీమ్‌ భక్తుల భద్రతను పర్యవేక్షించనుంది. అంతేకాదు, ఇప్పటివరకు 50మందిని ఒక గుంపుగా పంపితే, ఇప్పట్నుంచి 100మంది ఉంటేనే పంపించనున్నారు. అనుమానమే నిజమైంది, నిర్లక్ష్యమే బలి తీసుకుంది, అవును ముమ్మాటికీ నిర్లక్ష్యమే చిన్నారి లక్షిత ప్రాణాలను తీసేసింది. సరిగ్గా 50రోజులక్రితం ఇదే అలిపిరి నడకదారిలో ఐదేళ్ల పిల్లాడు కౌశిక్‌పై చిరుత ఎటాక్‌ జరిగింది. తాత చేయి పట్టుకొని నడివెళ్తోన్న కౌశిక్‌పై అమాంతం దాడిచేసి అడవిలోకి ఎత్తుకుపోయింది. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు ఆ పిల్లాడు. అప్పుడే ఆ చిరుతను బంధించి డీప్‌ ఫారెస్ట్‌లో వదిలిపెట్టారు, అయితే అక్కడే మరో చిరుత తిరుగుతోందన్న సమాచారంపై నిర్లక్ష్యంగా జరిగింది. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు చిన్నారి లక్షితను బలి తీసుకుంది.

నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన దినేష్‌, శశికళ దంపతులు… కూతురు లక్షితతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. అయితే, అలిపిరి నడకమార్గంలో చిన్నారి కనిపించకుండా పోయింది. నర్సింహస్వామి టెంపుల్‌ సమీపంలో తప్పిపోవడంతో ఆ ప్రాంతమంతా గాలించారు తల్లిదండ్రులు. సాయంత్రం 6గంటల 45నిమిషాల టైమ్‌లో లక్షిత మిస్‌ అయితే, రాత్రి 11తర్వాత పోలీసులకు కంప్లైంట్‌ చేశారు. వెంటనే గాలింపు చేపట్టిన పోలీసులు, నర్సింహస్వామి ఆలయం సమీపంలో లక్షిత మృతదేహాన్ని గుర్తించారు. లక్షితను చంపి, సగం తినేసి వదిలేసింది చిరుత.

ఇవి కూడా చదవండి

చిరుతపులి పంజాకి బలైన చిన్నారి లక్షిత స్వగ్రామంలో రోదనలు మిన్నంటాయ్‌!. లక్షిత మృతదేహాన్ని చూసి బంధుమిత్రులంతా తల్లడిల్లిపోయారు!. అంబులెన్స్‌ లక్షిత ఇంటికి చేరుకోగానే ఏడుపులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. అయితే, తమ బిడ్డ మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటోంది లక్షిత తల్లి. వెంటనే స్పందించి ఉంటే తమ బిడ్డ ప్రాణాలు పోయేవి కాదని ఆరోపిస్తోంది. అయితే, లక్షిత తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. పిల్లలను జాగ్రత్తగా పెట్టుకోమని అనౌన్స్‌మెంట్స్‌ ఇస్తూనే ఉన్నామన్నారు. లక్షిత మృతితో టీటీడీ అలర్టైంది. నడక మార్గాల్లో భక్తుల భద్రతను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించింది. అలిపిరి దగ్గర మధ్యాహ్నం 2గంటలకు, శ్రీవారి మెట్టు దగ్గర మధ్యాహ్నం 3గంటలకు నడకదారి మూసేసే ప్రతిపాదనలపై ఆలోచన చేస్తోంది టీటీడీ. తిరుమల నడకదారులను హైఅలర్ట్‌ జోన్స్‌గా ప్రకటించింది టీటీడీ. ఏడో మైలురాయి నుంచి నరసింహస్వామి ఆలయం వరకు సెక్యూరిటీ డబుల్‌ చేసింది. ఇకపై ప్రతి 40 అడుగులకు ఒక్కో టీమ్‌ భక్తుల భద్రతను పర్యవేక్షించనుంది. అంతేకాదు, ఇప్పటివరకు 50మందిని ఒక గుంపుగా పంపితే, ఇప్పట్నుంచి 100మంది ఉంటేనే పంపించనున్నారు. అదనంగా 5వందల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు చిరుతను బంధించేందుకు బోన్లు కూడా పెట్టారు అధికారులు. మరి, మరొకరు బలి కాకుండా టీటీడీ చేయగలుగుతుందా? లేదో చూడాలి!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..