Vizag Steel Plant: వాటే ప్లాన్..! వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేసే యోచనలో తెలంగాణ సర్కార్..
కేంద్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ కార్యచరణ ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే స్టేట్మెంట్ ప్రకటించింది. కేంద్రం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది.
కేంద్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ కార్యచరణ ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే స్టేట్మెంట్ ప్రకటించింది. కేంద్రం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. బిడ్డింగ్ లో పాల్గొనేందుకు కసరత్తు చేస్తుంది. జేఎస్ రంజన్ నేతృత్వంలో బిడ్డింగ్ కు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బిడ్డింగ్‌కు ప్రణాళికలు చేస్తున్నారు.
ఇప్పటికే, తెలంగాణలో సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకించిన బీఆర్ఎస్.. ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది బీఆర్ఎస్. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేయనుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ధర్నాచేస్తున్న కార్మికులకు మద్దతు తెలపనుంది. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఇవాళ కార్మికులతో కలిసి ధర్నాలో పాల్గొంటున్నారు.
బీఆర్ఎస్ స్ట్రాటెజీ ఏపీ పొలిటికల్ వర్గాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది. అయితే, మున్ముందు ప్రణాళిక, కార్యచరణ ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..