తన అనుచరుల వద్ద కన్నీరు పెట్టుకున్న మాజీ మహిళా ఎమ్మెల్యే..

ఇప్పుడు రాజకీయ పార్టీలలో ఎక్కడ చూసినా టికెట్ల గోలే వినిపిస్తోంది. వైసిపి శనివారం 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఆ పార్టీ నేతలలో ఇంతవరకు ఉన్న ఉత్కంఠకు తెర దింపితే. ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపిలు మాత్రం ఇంకా విడతలు విడతలుగా అభ్యర్థులను ప్రకటిస్తూ ఉన్నాయి. దీంతో ఆయా పార్టీల నేతలలో మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతునే ఉంది. తమకు టికెట్ వస్తుందా లేదా అనే ఆందోళనతో నియోజకవర్గ సమన్వయకర్తలు, ఆశావహులు ఎదురు చూస్తున్నారు. తమకు గిట్టని వారికి టికెట్ రాకూడదని రాజకీయాలు చేసే సొంతపార్టీలోని నేతలు కొందరు ఉన్నారు.

తన అనుచరుల వద్ద కన్నీరు పెట్టుకున్న మాజీ మహిళా ఎమ్మెల్యే..
Srikakulam District
Follow us
S Srinivasa Rao

| Edited By: Srikar T

Updated on: Mar 17, 2024 | 7:16 AM

ఇప్పుడు రాజకీయ పార్టీలలో ఎక్కడ చూసినా టికెట్ల గోలే వినిపిస్తోంది. వైసిపి శనివారం 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఆ పార్టీ నేతలలో ఇంతవరకు ఉన్న ఉత్కంఠకు తెర దింపితే. ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపిలు మాత్రం ఇంకా విడతలు విడతలుగా అభ్యర్థులను ప్రకటిస్తూ ఉన్నాయి. దీంతో ఆయా పార్టీల నేతలలో మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతునే ఉంది. తమకు టికెట్ వస్తుందా లేదా అనే ఆందోళనతో నియోజకవర్గ సమన్వయకర్తలు, ఆశావహులు ఎదురు చూస్తున్నారు. తమకు గిట్టని వారికి టికెట్ రాకూడదని రాజకీయాలు చేసే సొంతపార్టీలోని నేతలు కొందరు ఉన్నారు. పొత్తు ఎక్కడ తమ కొంప ముంచుతుందోనన్న భయం మరికొందరు నేతలది. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా రోడ్డెక్కుతున్నారు. గురువారం ఎచ్చెర్ల టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి, పార్టీ సీనియర్ నేత కళా వెంకటరావు పేరును 2వ జాబితాలోను ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ అతని అనుచరులు ఎచ్చెర్ల పార్టీ కార్యాలయంలో సమావేశం కాగా.. తాజాగా శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపి ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవి శుక్రవారం తన అనుచరుల వద్ద కన్నీరు పెట్టుకున్నారు. టిడిపి ప్రకటించిన రెండు జాబితాల్లోను లక్ష్మీదేవి పేరు లేదు. టికెట్ విషయంలో కొంతకాలంగా గుండలక్ష్మీదేవికి టిడిపి నేత గొండు శంకర్‎కు మధ్య వర్గ పోరు కొనసాగుతోంది. అయితే ఈ దశలోనే తాజాగా శ్రీకాకుళం అసెంబ్లీ టికెట్ బిజెపికి కేటాయిస్తున్నారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఈ గందరగోళ పరిస్థితుల నడుమ లక్ష్మీదేవి తీవ్రంగా కలత చెంది అవేదనకు గురయ్యారు. ఈనేపథ్యంలోనే తన నివాసం వద్ద ఆమెను కలిసేందుకు వచ్చిన అనుచరులతో మాట్లాడుతూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉందామని అంటూనే ఆమె తీవ్ర మనస్థాపానికి గురై కన్నీటిపర్యంతం అయ్యారు.

అచ్చెన్నాయుడుపై మాజీ మంత్రి ఫైర్..

టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు గుండ లక్ష్మీదేవి భర్త, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ. ఒకే ఇంట్లో ఎంపీ ఒక మాట మాట్లాడుతారు.. పైనున్నాయన ఇంకో మాట మాట్లాడతారంటూ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, బాబాయి అచ్చెన్నాయుడులని ఉద్దేశించి అన్నారు. మీరే గ్రూపులు పెట్టి, స్టాండ్స్ పెట్టి అటు ఇటు మాట్లాడితే తాము ఎలా పని చేయాలని మండిపడ్డారు. ఇప్పటికైనా మీ మోస ఆలోచనలు చంద్రబాబుకు చెప్పండి.. ఆ తర్వాత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం అని అన్నారు. తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేశాను, మంత్రిగా చేశా, నా భార్య మాజీ ఎమ్మెల్యే అయితే తనని ఇంతగా అవమానిస్తారా అంటూ మండిపడ్డారు. తన భార్య 4సార్లు అచ్చెన్నాయుడుని కలిసి గ్రూపులు వద్దు. సరిచేయండని బతిమలాడారని.. కానీ ఆమె మాటలను బేఖాతరు చేసి గ్రూప్స్ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అన్యాయం అని ఆరోపించారు. తాను శ్రీకాకుళం జడ్పీ చైర్మన్‎గా పనిచేసినప్పుడు ఒక్క ఫౌండేషన్ స్టోన్ వేయనివ్వకుండా తనను ఎంతో అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు గుండ అప్పల సూర్యనారాయణ.

ఎంపీ ఇంటిపై అనుచరుల ఆందోళన..

శ్రీకాకుళం టిడిపి ఇన్చార్జ్ గుండ లక్ష్మీదేవి కన్నీరు పెట్టుకోక ముందు ఎం.పి. రామ్మోహన్ నాయుడు ఇంటి వద్ద గుండ లక్ష్మీదేవి అనుచరులు ఆందోళనకు దిగారు. శ్రీకాకుళం అసెంబ్లీ టిక్కెట్ గుండ లక్ష్మిదేవికి ఇవ్వాలంటూ ఎంపీ నివాసం ముందు బైఠాయించి అర్ధనగ్న నిరసన ప్రదర్శన తెలిపారు. శ్రీకాకుళం ఎంపి స్థానం టీడీపీ గెలవాలంటే శ్రీకాకుళం అసెంబ్లీ టికెట్ లక్ష్మీదేవికి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇంటి దగ్గర లేకపోవడంతో ఫోన్లో ఆయనతో గుండ లక్ష్మీదేవి అనుచరులు మాట్లాడారు. లక్ష్మీదేవికి టికెట్ ఇవ్వకపోతే ఎంపీగా గెలుపు కష్టమవుతుందని నేతలు నేరుగా ఎంపీ రామ్మోహన్ నా తేల్చి చెప్పారు. అయితే కొసమెరుపు ఏంటంటే శుక్రవారం ఎంపీ నివాసం వద్ద నిరసన తెలిపిన గుండ అనుచరులు 24 గంటలు జరగక ముందే తిరిగి గుండ లక్ష్మీదేవి నివాసం వద్ద ప్రెస్ మీట్ పెట్టీ అవేశంలో శుక్రవారం ఎంపీ నివాసం వద్ద చేసిన ఆందోళనకు చింతిస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…