AP News: పిఠాపురం టీడీపీలో చల్లబడిన అసంతృప్తి జ్వాలలు.. పవన్‌ను భారీ మెజార్టీ గెలిపించాలని..

ఎమ్మెల్సీ హామీతో పిఠాపురంలో పొలిటికల్‌ వేడి చల్లబడింది. మాజీ ఎమ్మెల్యే వర్మ తాను కూల్‌ అవడమే కాదు ..కూల్‌ కూల్‌ అంటూ క్యాడర్‌నూ చల్లపరిచారు. పవన్‌ గెలుపే లక్ష్యంగా పిఠాపురంలో ఇక పసుపు సేన కదంతొక్కుతుందన్నారు.

AP News: పిఠాపురం టీడీపీలో చల్లబడిన అసంతృప్తి జ్వాలలు.. పవన్‌ను భారీ మెజార్టీ గెలిపించాలని..

|

Updated on: Mar 16, 2024 | 9:56 PM

ఎమ్మెల్సీ హామీతో పిఠాపురంలో పొలిటికల్‌ వేడి చల్లబడింది. మాజీ ఎమ్మెల్యే వర్మ తాను కూల్‌ అవడమే కాదు ..కూల్‌ కూల్‌ అంటూ క్యాడర్‌నూ చల్లపరిచారు. పవన్‌ గెలుపే లక్ష్యంగా పిఠాపురంలో ఇక పసుపు సేన కదంతొక్కుతుందన్నారు. అలా ప్రకటన  వచ్చిందో లేదో  ఇలా  అసంతృప్తి రాజుకుంది. పిఠాపురంను టీడీపీ కంచుకోటగా మార్చిన  సత్యనారాయణ  వర్మకు టికెట్‌ లేదని, రాదని తెలిసి కార్యకర్తలు అభిమానుల్లో ఆవేదన ఆగ్రహ రూపంలో కట్టలు తెగింది.

పొత్తుతో తమ నేత ఆశలకు చిచ్చు పెట్టారని వర్మ అనుచరులు, అభిమానులు ఆందోళనలకు దిగారు. వర్మ  ఎంత నచ్చచెప్పినా క్యాడర్‌ మాత్రం ఆయనకే టికెట్‌ ఇవ్వాలని పట్టుపట్టారు. ఈక్రమంలో  ఉండవల్లి నుంచి   పిలుపు రావడంతో కార్యకర్తలు సమేతంగా వెళ్లి చంద్రబాబును కలిశారు. అంతే    అయిపోయింది ..ఇట్స్ గాన్‌  అన్నంతగా మ్యాటర్‌ చల్లబడింది.  వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీనివ్వడంతో  పిఠాపురం టీడీపీలో అసంతృప్తి జ్వాలలు చల్లారాయి. వర్మ కోరినట్టుగా పిఠాపురం అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తామని భరోసానిచ్చారు చంద్రబాబు. పవన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని  దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. మొత్తానికి అలా పిఠాపురంలో అసంతృఫ్తి  అలజడి సద్దుమణిగింది.

Follow us