Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nyaya Sadana Sadasu: షర్మిల సీఎం అయ్యేవరకూ అండగా ఉంటా.. విశాఖ సభలో సీఎం రేవంత్ రెడ్డి

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ విశాఖపట్నంలో నిర్వహించిన న్యాయ సాధన సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఆయన ప్రసంగంపై అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఎవరిని డిజప్పాయింట్ చేయకుండా ప్రసంగించారు. నిజమైన వైఎస్సార్ వారసురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నే అన్న రేవంత్ ఆంధ్ర ప్రదేశ్ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు వైఎస్ షర్మిలా రెడ్డి అని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలా రెడ్డి […]

Nyaya Sadana Sadasu: షర్మిల సీఎం అయ్యేవరకూ అండగా ఉంటా.. విశాఖ సభలో సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy Ys Sharmila
Follow us
Eswar Chennupalli

| Edited By: Balaraju Goud

Updated on: Mar 16, 2024 | 9:53 PM

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ విశాఖపట్నంలో నిర్వహించిన న్యాయ సాధన సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఆయన ప్రసంగంపై అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఎవరిని డిజప్పాయింట్ చేయకుండా ప్రసంగించారు. నిజమైన వైఎస్సార్ వారసురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నే అన్న రేవంత్ ఆంధ్ర ప్రదేశ్ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు వైఎస్ షర్మిలా రెడ్డి అని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలా రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తుందని, షర్మిలమ్మ ఇక్కడకు అధికారం కోసం రాలేదన్న రేవంత్.. ఆంధ్ర ప్రజల పక్షాన పోరాటం కోసం వచ్చిందన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలిసారి వచ్చిన రేవంత్ రెడ్డి విశాఖ ను సింగపూర్‌తో పోల్చారు. ఈ సభను చూస్తుంటే విశాఖ లో ఉన్నట్లు లేదు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సభ పెట్టినట్లు ఉందన్నారు. ఇక్కడకు వద్దాం అనుకున్నప్పుడు కాంగ్రెస్ ఏపీలో లేదు అని అన్నారనీ, అక్కడకు పోతే పరువు పోతుంది ఏమో అని అంటే నేను వైఎస్సార్ బిడ్డ షర్మిల సభ పెడితే ఎలా ఉటుందో చెప్పానన్నారు. ఇక్కడ సభ చూస్తే షర్మిల న్యాయకత్వం ఎలా ఉందో అర్ధం అవుతుందన్నారు. భౌగోళికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయాం, కానీ కలిసి ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

ఆనాడు కురుక్షేత్రంలో కౌరవులు, పాండవులు వేరు వేరు. కానీ వాళ్ళ మీదకు ఎవరైనా వస్తే అందరూ ఒకటయ్యారన్నారు రేవంత్ రెడ్డి. వైఎస్సార్ వారసులు ఎవరు అనేది అపోహలు, అనుమానాలు ఉండొచ్చు కానీ వైఎస్సార్ సంకల్పాన్ని నిలబెట్టే వాళ్ళే నిజమైన వారసులన్నారు. వైఎస్సార్ ఆశయాలకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు వైఎస్సార్ వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు రేవంత్. ఆంధ్ర ప్రాంతంలో ప్రశ్నించే గొంతులు లేవనీ, డిల్లీ నుంచి మోదీ ఆంధ్రను పాలిస్తున్నాడు అంటే ఇక్కడ ప్రశ్నించే గళం ఇంతవరకు లేదన్నారు. 10 ఏళ్లు అయినా పోలవరం కట్టలేదన విమర్శించారు. 10 ఏళ్లు దాటినా రాజధాని కట్టలేదనీ, తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు రేవంత్ ధ్వజమెత్తారు.

తెలుగు రాష్ట్రాల నుంచి మన ఖ్యాతి నీ పెంచేలా ఢిల్లీని ఎందరో శాసించారనీ, కానీ, ఇవ్వాళ రెండు రాష్ట్రాల్లో నాయకులు ఢిల్లీలో వంగి వంగి దండాలు పెట్టే వాళ్ళే ఉన్నారన్నారు రేవంత్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో వైఎస్సార్ ను రంగంలో దింపిందనీ, చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు 105 డిగ్రీల జ్వరం వచ్చినా పాదయాత్ర ను అపలేదని, అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకున్నాడన్నారు. 2004 లో కాంగ్రెస్ ను అధికారంలో తెచ్చాడని, 33 మంది ఎంపీలను గెలిపించారని, వైఎస్సార్ మొక్క బోని దీక్ష తోనే ఇటు రాష్ట్రంలో, అటూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి.

రాష్ట్రాలుగా విడిపోయాం కానీ తెలుగు బిడ్డలు గా కలిసి ఉండాలన్న రేవంత్ బీజేపీ అంటే ఇవ్వాళ బాబు, జగన్, పవన్ అని, వీళ్ళు మోదీ బలం, బలగమన్నారు. ఆంధ్రప్రదేశ్ లో షర్మిలమ్మకి అండగా నిలబడతానని, షర్మిలమ్మ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే వరకు అండగా ఉంటానన్న రేవంత్, ఆంధ్ర ప్రజలకు ఏ అవసరం వచ్చినా ముందు ఉంటానన్నారు. మొత్తానికి ఏపీలో ఆసక్తికరంగా సాగిన రేవంత్ పర్యాటన సభ విజయవంతంతో ముగిసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…