AP News: ఏపీలో ఒంటిపూట బడులు, వేసవి సెలవులు ఎప్పుడంటే.? పూర్తి వివరాలు..

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూపోతున్న ఉష్ణోగ్రతలకు జనాలు అల్లాడిపోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య రోడ్డు మీదకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే విద్యార్ధులకు..

AP News: ఏపీలో ఒంటిపూట బడులు, వేసవి సెలవులు ఎప్పుడంటే.? పూర్తి వివరాలు..
Ap Schools
Follow us

|

Updated on: Mar 16, 2024 | 8:58 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూపోతున్న ఉష్ణోగ్రతలకు జనాలు అల్లాడిపోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య రోడ్డు మీదకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే విద్యార్ధులకు వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఒంటిపూట బడులు నిర్వహించాలని అటు ఏపీ, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. తెలంగాణ ప్రభుత్వం మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తుండగా.. ఏపీలో హాఫ్ డే స్కూల్స్ ఎప్పుడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో విద్యార్ధులు తల్లిదండ్రులు వెంటనే ఏపీలో కూడా ఒంటిపూట బడులు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో ఒంటిపూట బడులపై కూడా కీలక అప్‌డేట్ ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

రాష్ట్రంలోని పాఠశాలలన్నింటికి మార్చి 18 నుంచి హాఫ్ డే స్కూల్స్ ప్రారంభమవుతాయని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఏదీ రాకపోగా.. ఇందుకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలకు సమాచారం అందిందని సమాచారం. మార్చి 18 నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎగ్జామ్ సెంటర్లుగా ఉన్న స్కూల్స్‌లో మధ్యాహ్నం నుంచి తరగతులు నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందట. ఇక అటు ఏప్రిల్ నెలాఖరు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని స్కూల్స్‌కు వేసవి సెలవులు ఉండనున్నాయని సమాచారం. దీనిపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. మరోవైపు తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే ఏప్రిల్ 24 స్కూల్స్‌కు పనిదినం కాగా.. తెలంగాణలో ఏప్రిల్ 25 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు.