Kuppam: ‘రౌడీలకు రౌడీగా ఉంటా’.. వైసీపీ చోటా రౌడీలకు భయపడేది లేదంటూ బాబు వార్నింగ్
వెసీపీ గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటుందో వారికే తెలియదని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన వైసీపీ ప్రజలు తరిమే రోజులు త్వరలోనే వస్తాయని పేర్కొన్నారు.

Andhra Pradsesh: రౌడీలకు రౌడీగా ఉంటా..వైసీపీ చోటా రౌడీలకు భయపడేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు(Nara Chandrababu Naidu). చిత్తూరు జిల్లా(Chittor District) కొల్లుపల్లిలో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు.. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలంటూ హెచ్చరించారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని..వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించిన చంద్రబాబు..ఎన్ని కేసులైనా పెట్టుకోండంటూ సవాల్ విసిరారు. భయం అనేది తన జాతకంలోనే లేదని..జైలుకెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. కుప్పంలో చోటామోటా నాయకులు రౌడీయిజం చేస్తున్నారని ఫైరయ్యారు. వైసీపీ నేతలకు కుప్పం నియోజకవర్గం అంటే కక్ష అని ఆగ్రహం వ్యక్తం చేశారు
రామకుప్పంలో ఉద్రిక్తత…
అయితే రామకుప్పం మండలం కొల్లుపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు రోడ్ షో జరిగే ప్రాంతాల్లో ఉన్న వైసీపీ బ్యానర్లను తొలగించాలని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో కుప్పం సీఐతో పాటు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. మరోవైపు చిత్తూరు జిల్లా కొంగనపల్లిలో ఘర్షణ జరిగింది. కొంగన పల్లి లో టిడిపి నేతల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు చంద్రబాబు. అయితే చంద్రబాబు కాన్వాయ్ దగ్గరకు వచ్చి జై జగన్ నినాదాలు చేశారు వైసిపి కార్యకర్తలు. జగన్ కు అనుకూలంగా నినాదాలు చేసిన కార్యకర్తను పక్కకు లాక్కెళ్లి చితకబాదారు టిడిపి కార్యకర్తలు. దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
వైసీపీ నేతలను తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉందంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కుప్పం నియోజకవర్గంలోని కొంగరపల్లిలో పర్యటించిన ఆయన ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు టీడీపీ హయాంలోనే జరిగాయన్నారు. వైసీపీ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన ఉండటంతో ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
