ఫేక్ సర్టిఫికెట్‌తో ఒకరు.. చేతి వాటంతో మరో ఉద్యోగి.. చివరకు జరిగింది ఇదే..

Prakasam District: ఒకరేమో ఫేక్ సర్టిఫికెట్ పెట్టి ప్రమోషన్ పొందిన ఉద్యోగి అయితే మరొకరేమో ఏకంగా ప్రభుత్వ కంటింజెంట్‌కి సంబంధించి అక్షరాల 21 లక్షలు స్వాహా చేసిన ఉద్యోగి. అయితే ఈ ఇద్దరు ఉద్యోగులపై వరుస ఫిర్యాదులు రావడంతో విచారణ చేసిన సబ్ కలెక్టర్ వారిని సస్పెండ్ చేయాలంటూ ఆదేశాలు జారీచేశారు.సస్పెండ్ అయిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదు అయి ఉండగా మరోసారి క్రిమినల్ కేసులు పెట్టేందుకు..

ఫేక్ సర్టిఫికెట్‌తో ఒకరు.. చేతి వాటంతో మరో ఉద్యోగి.. చివరకు జరిగింది ఇదే..
R&B Inspection Bungalow, Kanigiri
Follow us
Ch Murali

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jul 28, 2023 | 5:18 PM

ప్రకాశం జిల్లా, జూలై 28: ఒకరేమో ఫేక్ సర్టిఫికెట్ పెట్టి ప్రమోషన్ పొందిన ఉద్యోగి అయితే మరొకరేమో ఏకంగా ప్రభుత్వ కంటింజెంట్‌కి సంబంధించి అక్షరాల 21 లక్షలు స్వాహా చేసిన ఉద్యోగి. అయితే ఈ ఇద్దరు ఉద్యోగులపై వరుస ఫిర్యాదులు రావడంతో విచారణ చేసిన సబ్ కలెక్టర్ వారిని సస్పెండ్ చేయాలంటూ ఆదేశాలు జారీచేశారు.సస్పెండ్ అయిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదు అయి ఉండగా మరోసారి క్రిమినల్ కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. ఓ వైపు క్రిమినల్ కేసులు మరోవైపు ప్రభుత్వ సొమ్ము స్వాహాతో పాటు ఫేక్ సర్టిఫికెట్‌లు పెట్టి ప్రమోషన్ పొందిన ఇరువురిలో ఒకరు ఒంగోలు జిల్లా ఆర్ అండ్ బి శాఖలో పనిచేస్తున్న పొలయ్య.. కాగా మరొకరు గతంలో ఒంగోలులో పనిచేసి ప్రస్తుతం నెల్లూరు ఆర్ అండ్ బి కి బదిలీ అయి విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు.

ఒంగోలు జిల్లా కనిగిరి ఆర్ అండ్ బి డివిజన్‌లో పనిచేస్తున్న వెళ్ళం పొలయ్యతో పాటు ప్రస్తుతం నెల్లూరు ఆర్ అండ్ బి లో సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న శ్రీనివాసరావుపై సస్పెండ్ వేటు పడింది. ప్రస్తుతం సస్పెండ్ వేటు పడిన ఇద్దరు ఉద్యోగులు నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వారే. గతంలో ఇద్దరిపై ఆరోపణలు రావడంతో ఆర్ అండ్ బి ఎస్సి విచారణకు ఆదేశించారు.

అయితే విచారణ అధికారిగా ఉన్న ఆర్ అండ్ బి శాఖ అడ్మినిస్ట్రేషన్ సూపరింటెండెంట్ ఇరువురి ఉద్యోగులకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వలేదనే కారణంగా ఆఫీస్లోనే బయటి వ్యక్తుల సాయంతో సూపరింటెండెంట్‌పై దాడి చేయించడంతో ఫాల్స్ ఎస్సి, ఎస్టీ కేసులు పెట్టించారని సూపరింటెండెంట్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇక మరోసారి విచారణ చేసిన సబ్ కలెక్టర్ పూర్తి స్థాయి విచారణ చేసిన ఆ అనంతరం పొలయ్య, శ్రీనివాసులు ఇద్దరిపై సస్పెండ్ వేటుకు ఆదేశించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..