Andhra Pradesh: వీడు మామూలోడు కాదు..! రూ.7కోట్లు వసూలు చేశాడు.. చివరకు వాళ్లతో కలిసి ట్విస్ట్ ఇచ్చాడు..

Anantapur: చిట్టిలు వేయండి.. ఆసరాగా ఉంటాయ్.. చిట్టీలతో మంచి లాభమే ఉంటుంది.. మంచి వడ్డీ.. ఎక్కువ డబ్బులు వస్తాయ్..! ఒక్కసారి వేస్తే తెలుస్తుందిగా.. మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.. భవిష్యత్తుకు బాసటగా ఉంటాయ్.. ట్రై చేయండి అంటూ అందర్నీ నమ్మించాడు. పెద్ద ఎత్తున వసూలు చేశాడు.. కట్ చేస్తే.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా చిట్టీల పేరుతో 7 కోట్లకు కుచ్చుటోపి పెట్టాడు..

Andhra Pradesh: వీడు మామూలోడు కాదు..! రూ.7కోట్లు వసూలు చేశాడు.. చివరకు వాళ్లతో కలిసి ట్విస్ట్ ఇచ్చాడు..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 28, 2023 | 5:44 PM

అనంతపురం, ఆగస్టు 28: చిట్టిలు వేయండి.. ఆసరాగా ఉంటాయ్.. చిట్టీలతో మంచి లాభమే ఉంటుంది.. మంచి వడ్డీ.. ఎక్కువ డబ్బులు వస్తాయ్..! ఒక్కసారి వేస్తే తెలుస్తుందిగా.. మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.. భవిష్యత్తుకు బాసటగా ఉంటాయ్.. ట్రై చేయండి అంటూ అందర్నీ నమ్మించాడు. పెద్ద ఎత్తున వసూలు చేశాడు.. కట్ చేస్తే.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా చిట్టీల పేరుతో 7 కోట్లకు కుచ్చుటోపి పెట్టాడు.. ఆ డబ్బులు ఎగ్గొట్టేందుకు ట్రాన్స్‌జెండర్‌గా మారినట్లు నాటకాలు ఆడాడు. ఒకటేంటి..? ఎన్ని వెర్రి వేషాలో వేయాలో అన్నీ వేషాలు వేసి కలరింగ్‌ ఇచ్చాడు కేటుగాడు. కానీ.. అందరూ ఎదురు తిరగడంతో.. చిట్టీలు ఏమోగానీ.. కళ్లు తేలేసే విషయం బయటకు వచ్చింది. గురుడు చిట్టీల పేరుతో అక్షరాల ఏడు కోట్ల రూపాయలు దండుకున్నాడు.. చివరకు చేసేదేం లేక బాధితులు పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా సాయినగర్‌కు చెందిన రామాజంజనేయులు.. వృత్తి ల్యాబ్‌ టెక్నీషియన్‌, ప్రవృత్తి మాత్రం చిట్టీల వ్యాపారం. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేసే రామాంజనేయులు.. అక్కడ పనిచేసే వైద్యులు, నర్సులు, రోగి బంధువులతో చనువుగా మాట్లాడి అధికవడ్డీ ఇస్తానని నమ్మించి చిట్టీల రొంపిలోకి దింపేవాడు. దాదాపు వందలాది మంది నుంచి రూ.7 కోట్లకుపైగా వసూలు చేశాడు. రోజులు గడుస్తున్నా.. వడ్డీ కాదు కదా.. కనీసం అసలు కూడా ఇవ్వకపోవడంతో చిట్టీ కట్టినవారంతా రామాంజనేయులును నిలదీశారు. దాంతో కొద్దిరోజులుగా అతను కనిపించకుండాపోవడంతో బాధితులు స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును కలిసి ఫిర్యాదు చేశారు.

ఇక.. ఇక్కడే కేటుగాడు రామాంజనేయులు మరో ట్విస్ట్‌ ఇచ్చాడు. బాధితులకు డబ్బు ఎగ్గొట్టేందుకు హైడ్రామా క్రియేట్‌ చేశాడు. ట్రాన్స్‌జెండర్‌గా మారినట్లు బాధితులందరికీ ఓ వీడియో రిలీజ్ చేశాడు. అందులో ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు, అతని పేరు శ్రావణిగా మారుస్తున్నట్లు వీడియోను సృష్టించాడు. దాంతో బాధితులు తమ డబ్బులు వస్తాయో..రావోనన్న టెన్షన్‌లో ఉన్నారు. దీంతో బాధితులు చిట్టీల నిర్వాహకుడు రామాంజనేయులుపై పోలీసులకు పిర్యాదు చేశారు. ఏంతో కష్టం చేసి డబ్బులు దాచుకున్నామని.. ఎలాగొలా డబ్బులు వసూలు చేసి ఇవ్వాలంటూ మొరపెట్టుకున్నారు. డబ్బులు ఎగ్గొట్టేందుకు రామాంజినేయులు ట్రాన్స్‌జెండర్ గా మారినట్టు వివరించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..