AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఒక్కసారిగా ఆగిపోయిన కోడి పిల్లల అరుపులు.. ఏమైందా అని వెళ్లి బుట్ట కింద చూడగా..

మల్కాపురం జయేంద్ర కాలనీలో కొండచిలువ హల్ చల్ చెసింది. ఇంటి ఆరు బయట బుట్ట కింద కోడి పిల్లలను ఉంచడంతో.. అందులోకి చొరబడిన కొండచిలువ.. ఆవురావురమంటూ కోడి పిల్లలను మింగడం మొదలెట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు కోడి పిల్లలను మింగేసింది. ఇంటి యజమాని.. బుట్టలో నుంచి కోడి పిల్లల శబ్దాలు ఒక్కసారిగా ఆగిపోవడంతో అక్కడికి వెళ్లి చూస్తే బుట్టలో అవి కనిపించలేదు. ఏమైపోయాయి అని ఒక్కసారిగా బుట్ట ఎత్తి చూస్తే.. అందులో కొండచిలువ తిష్ట వేసుకుంది.

AP News: ఒక్కసారిగా ఆగిపోయిన కోడి పిల్లల అరుపులు.. ఏమైందా అని వెళ్లి బుట్ట కింద చూడగా..
Huge Python
Maqdood Husain Khaja
| Edited By: Ram Naramaneni|

Updated on: Aug 28, 2023 | 5:34 PM

Share

ఆగస్టు 28:  విశాఖలో ఓ ఇంట్లో కోడి పిల్లలు పెంచుతున్నారు. అప్పటివరకు కిలకిలలాడే పిల్లల శబ్దాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. అరిచి.. శబ్దాలు పెడితే షరా మామూలుగానే అనుకున్నారు వాటిని పెంచుతున్న ఇంటి యజమానులు. అప్పటివరకు అరిచే ఆ కోడి పిల్లల శబ్దాలు ఆగిపోయాయి. మెల్లగా బుట్ట వైపు వెళ్లారు.. అయినా కిమ్మనలేదు. లోపల తొంగి చూసారు. కోడి పిల్లలు కనిపించలేదు… కానీ ఏదో ఉంది. బుట్ట ఎత్తి చూసేసరికి.. వామ్మో గుండెలు ఆగేంత పనయ్యి.. పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ బుట్ట కింద ఉన్నది కోడి పిల్లల కాదు.. భారీ కొండచిలువ…!

విశాఖలో జనావాసాల్లోకి వచ్చిన కొండచిలువ కలకలం రేపింది. బుట్ట కింద ఉన్న కోడి పిల్లలను అమాంతంగా మింగేసింది. మరికొన్నింటి కోసం తిష్ట వేసి కూర్చుంది ఆ కొండచిలువ. విషయాన్ని గుర్తించిన స్థానికులు కొండచిలువను చూసి కంగుతిన్నారు.

మల్కాపురం జయేంద్ర కాలనీలో కొండచిలువ హల్ చల్ చెసింది. ఇంటి ఆరు బయట బుట్ట కింద కోడి పిల్లలను ఉంచడంతో.. అందులోకి చొరబడిన కొండచిలువ.. ఆవురావురమంటూ కోడి పిల్లలను మింగడం మొదలెట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు కోడి పిల్లలను మింగేసింది. ఇంటి యజమాని.. బుట్టలో నుంచి కోడి పిల్లల శబ్దాలు ఒక్కసారిగా ఆగిపోవడంతో అక్కడికి వెళ్లి చూస్తే బుట్టలో అవి కనిపించలేదు. ఏమైపోయాయి అని ఒక్కసారిగా బుట్ట ఎత్తి చూస్తే.. అందులో కొండచిలువ తిష్ట వేసుకుంది. దీంతో గుండెలు బాదుకుంటూ పరుగులు పట్టి ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పారు. అంతా వచ్చి చూస్తున్నారు తప్ప ఎవరు అక్కడి వరకు వెళ్లే సాహసం చేయట్లేదు. ఆ కోడి పిల్లలను తిన్న కొండచిలువ కూడా కదలకుండా అక్కడే ఉండిపోయింది. ఎంతకీ కదలకపోవడంతో స్నేక్ కేచర్ కు సమాచారం అందించారు స్థానికులు. రంగంలోకి దిగిన స్నేక్ కేచర్.. చాకచక్యంగా కొండ చిలువను బంధించి శివారులో వదిలేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా అడవి జంతువులు, పాములు ఏవైనా కనిపిస్తే.. వాటిని చంపకుండా తమకు సమాచారం ఇవ్వాలని ఫారెస్ట్ సిబ్బంది సూచిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో, ఏజెన్సీ ఏరియాల్లో ఉండేవారు వన్యప్రాణుల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..