AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగుళూరు తరువాత నీటి సంక్షోభం ఎదుర్కుంటున్న నగరం అదే..

విశాఖ అంటేనే గుర్తుకు వచ్చేది సముద్రమే. కనుచూపు మేర కనిపించింది నీరే. భూమి ఆకాశంను కలిపినట్టుగా కనుచూపు మేర సముద్రం కనిపించినా తాగడానికి మాత్రం విశాఖ అనేక ప్రాంతాలలో నీరు దొరకదు. సముద్రం నీరు తాగడానికి పనికి రాదు, దీంతో విశాఖ వాసుల బాధ వర్ణనాతీతం.

బెంగుళూరు తరువాత నీటి సంక్షోభం ఎదుర్కుంటున్న నగరం అదే..
Visakhapatnam
Eswar Chennupalli
| Edited By: Srikar T|

Updated on: May 15, 2024 | 12:41 PM

Share

విశాఖ అంటేనే గుర్తుకు వచ్చేది సముద్రమే. కనుచూపు మేర కనిపించింది నీరే. భూమి ఆకాశంను కలిపినట్టుగా కనుచూపు మేర సముద్రం కనిపించినా తాగడానికి మాత్రం విశాఖ అనేక ప్రాంతాలలో నీరు దొరకదు. సముద్రం నీరు తాగడానికి పనికి రాదు, దీంతో విశాఖ వాసుల బాధ వర్ణనాతీతం. రోజువారీ అవసరాలను తీర్చడానికి, వైజాగ్‌కు 80 మిలియన్ గ్యాలన్ల (MGD) నీరు అవసరం. దీంతోపాటు అనేక పారిశ్రామిక యూనిట్లకు 50 MGD నీటి సరఫరా కూడా అవసరం. ఇలా రోజుకు 130 మిలియన్ల నీరు కావల్సి ఉంటుంది.

బెంగుళూరు తర్వాత విశాఖ నే..

దక్షిణ భారత దేశంలో తాగు నీటి సంక్షోభం ఎదుర్కుంటున్న నగరాలలో బెంగళూరు తర్వాత స్థానంలో ఇప్పుడు విశాఖ చేరింది. విశాఖలో కొనసాగుతున్న విపరీతమైన వేడిగాలుల మధ్య అనేక రిజర్వాయర్లు ఎండిపోవడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నీటి సంక్షోభం ఏర్పడింది. అంతేకాకుండా, ఈ రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఎక్కడ నుండి లభిస్తుందో అక్కడ కూడా నీటి నిల్వలు పడిపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

పీఎం పాలెం ప్రాంతాల్లో ఎక్కువ..

విశాఖలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంది. ఇతర ప్రాంతాలతో పాటు, పిఎం పాలెం ప్రాంతం అధిక నీటి కొరతతో కొట్టుమిట్టాడుతోంది. పీఎం పాలెంతో పాటు శివాజీపాలెం, మద్దిలపాలెం, సీతమ్మధార, ఎంవీపీ కాలనీ వంటి ఇతర ప్రాంతాలకు అవసరాలతో పోల్చితే తక్కువ నీరు అందుతోంది.

ఇవి కూడా చదవండి

విశాఖ అవసరాలకు రోజూ 130 మిలియన్ గ్యాలన్లు అవసరం..

రోజువారీ అవసరాలను తీర్చడానికి, వైజాగ్‌కు 80 మిలియన్ గ్యాలన్ల (MGD) నీరు అవసరం. మరోవైపు విశాఖలో పరిశ్రమలు కూడా పెద్ద సంఖ్యలో ఉండడం వల్ల అదనంగా మరింత నీటి వినియోగం ఉంటుంది. స్టీల్ ప్లాంట్లు, APIIC, గంగవరం పోర్ట్, NTPC వంటి అనేక పారిశ్రామిక యూనిట్లకు రోజూ 50 MGD నీటి సరఫరా అవసరం. దీంతో జివిఎంసి అధికారులు వివిధ రిజర్వాయర్‌ల నుండి 130 ఎంజిడి నీటిని వివిధ ప్రాంతాలలో పంపిణీ చేసేలా చూసుకోవాల్సి ఉంటుంది. తాగునీటికే కాదు, నీటి కొరత నగరంలోని కీలకమైన పరిశ్రమలను కూడా ప్రభావితం చేస్తోంది. ఏలూరు రిజర్వాయర్ నుంచి సేకరించే 90 ఎంజీడీల్లో 50 ఎంజీడీలు ప్రజా అవసరాలకు, 30 ఎంజీడీలు స్టీల్ ప్లాంట్లకు, 10 ఎంజీడీలను ఏపీఐఐసీ సెజ్, గంగవరం పోర్టు, ఎన్టీపీసీ వంటి పరిశ్రమలకు ఇస్తున్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి రైవాడ, ముడసర్లోవ, తాటిపూడి, గంభీరం, గోస్తని నది వంటి ఇతర రిజర్వాయర్ల నుంచి 40 ఎంజీడీలను తీసుకుంటారు.

వర్షాభావం, వేడి గాలుల వల్లే..

వేసవి కాలం ప్రారంభంలో వర్షాలు లేకపోవడం, తీవ్రమైన వేడిగాలుల కారణంగా నీటి కొరత ఏర్పడుతుంది. నగరానికి ప్రాథమిక నీటి వనరుగా భావించే ఏలేరు రిజర్వాయర్‌లో కూడా నీటి నిల్వలు పడిపోయి కాల్వలోకి నీరు వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిణామాల మధ్య రిజర్వాయర్ నుంచి కాల్వలోకి నీటిని పంపింగ్ చేసేందుకు జివిఎంసి 10 మోటార్లను ఏర్పాటు చేసింది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా రిజర్వాయర్ నీటిమట్టం 69.09 మీటర్లకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రస్తుతం నీటి ఎద్దడి మరింత తీవ్రమవుతుందని అధికారులు భయాందోళన చెందుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..