Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రతుకు జీవనమే కాదు.. అతని దేహమే బంగారు రూపం.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన యువకుడు..

ఈసారి మీరు విశాఖ బీచ్ రోడ్డులో షికారు చేస్తున్నప్పుడు, రోడ్డు మధ్యలో నిలబడి ఉన్న బంగారు విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అది విగ్రహం కాదు, బంగారు రంగులలో పెయింట్ చేయబడిన ఒక వ్యక్తి. పర్యాటకుల వినోదం కోసం కదలకుండా నిలబడి ఉండే మనిషి అతను. నేటి యువతకు జీవనోపాధిని పొందేందుకు వివిధ నైపుణ్యాలు ఉన్నాయి.

బ్రతుకు జీవనమే కాదు.. అతని దేహమే బంగారు రూపం.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన యువకుడు..
Vishakapatnam Beach
Follow us
Eswar Chennupalli

| Edited By: Srikar T

Updated on: May 15, 2024 | 11:20 AM

ఈసారి మీరు విశాఖ బీచ్ రోడ్డులో షికారు చేస్తున్నప్పుడు, రోడ్డు మధ్యలో నిలబడి ఉన్న బంగారు విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అది విగ్రహం కాదు, బంగారు రంగులలో పెయింట్ చేయబడిన ఒక వ్యక్తి. పర్యాటకుల వినోదం కోసం కదలకుండా నిలబడి ఉండే మనిషి అతను. నేటి యువతకు జీవనోపాధిని పొందేందుకు వివిధ నైపుణ్యాలు ఉన్నాయి. అలాంటి నైపుణ్యాలలో ఇది ఒకటి. ప్రదీప్ ఘోష్ అనే యువకుడు నిమిషాల పాటు కదలకుండా ఉండే తన నైపుణ్యాలను ఇలా ఉపయోగించుకుంటున్నాడు.

విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులోని జలాంతర్గామి సమీపంలో ఈ యువకుడు తాజాగా సంచలనంగా మారాడు. “స్టాండింగ్ గోల్డ్ మ్యాన్” అని పిలువబడే అతను స్థానికులు, పర్యాటకులను ఆహ్లాదపరిచేలా బంగారు రంగులో పెయింట్ చేసుకుని విగ్రహంలా మారాడు. ఇలాంటి విగ్రహం రూపంలో సజీవంగా ఉండే మనుషులు సాధారణంగా ఇతర దేశాలలో కనిపిస్తుంటారు. అయితే ప్రదీప్ ఈ ప్రత్యేకమైన వీధి ప్రదర్శనను విశాఖపట్నంకు తీసుకువచ్చారు, దీంతో ఇది త్వరగా ప్రజాదరణ పొంది ప్రత్యేక ఆకర్షణీయంగా మారింది. ప్రదీప్ చేసిన పనికి సందర్శకులు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. బీచ్ రోడ్‎కు వచ్చే వాళ్ళు అతనితో సెల్ఫీ తీసుకోకుండా వెళ్ళడంలేదు. ప్రస్తుతం బీచ్ రోడ్‌లో అటుగా వెళ్ళే ప్రజలు తరచుగా ప్రదీప్‎తో కరచాలనం చేయడానికి, అతనితో మాట్లాడటానికి ఆసక్తి చూపుతుందడం విశేషం.

కోల్‎కత్తా నుంచి అదే ఉపాదిగా వచ్చి..

తాను కోల్‌కతాకు చెందినవాడినని, ఎనిమిది నెలల క్రితం విశాఖపట్నం వచ్చానని చెప్తాడు ప్రదీప్. రోజూ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ప్రదీప్ బీచ్‌లో కనిపిస్తాడు. ఒక్కో స్ట్రెచ్‎లో 15 నుండి 20 నిమిషాల పాటు నిశ్చలంగా విగ్రహంగా కదలకుండా ఉండడం ప్రదీప్ ప్రత్యేకత. ఈ 20 నిమిషాల వ్యవధిలో అటుగా వెళ్ళే కనీసం పదుల సంఖ్యలో పర్యాటకులు ప్రదీప్ తో షేక్ హ్యాండ్ కోసం వేచి చూస్తూ ఉంటారు. ఆ 20 నిమిషాల స్ట్రెచ్ ఆయిన వెంటనే రిలాక్స్ అయ్యే ప్రదీప్ అక్కడి విశేషాలను పర్యాటకులకు వివరించడంతో పాటు వారితో వచ్చే పిల్లలను తీసుకుని సబ్ మెరైన్ వరకు వెళ్లి వదలి వస్తారు.

ఇవి కూడా చదవండి

ప్రదీప్ ఘోష్ సంపాదన ఎంతో తెలిస్తే..

ఈ వినూత్న ప్రదర్శన కేవలం వినోద రూపమే కాదు ప్రదీప్ జీవనాధారం కూడా. రద్దీని బట్టి రోజుకు వెయ్యి నుంచి మూడు వేల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు టీవీ9 తో తెలిపారు ప్రదీప్. పర్యాటకుల స్పందన వారి ప్రశంసలే తనకు ఊపిరి అంటాడు ప్రదీప్. సాధారణంగా బీచ్‌ రోడ్‎లోని సబ్‌మెరైన్ కురుసుర సమీపంలో కనిపిస్తాడు. కోల్‎కత్తాలో ఉన్న సమయంలో సోషల్ మీడియాలో ఇలాంటి ప్రదర్శనలను చూసిన తర్వాత ఇలా తన వృత్తిని ప్రారంభించడానికి ప్రేరణ పొందానని, దీనికి విశాఖ నగరంలో మంచి ఆదరణ లభించడం తన అదృష్టం అంటున్నాడు ప్రదీప్. తాను ఈ వృత్తికి తెలిసిన వాళ్ళ సహకారంతో విశాఖను ఎంచుకున్నానని, ప్రస్తుతం వస్తున్న స్పందనతో నా నిర్ణయం సరైందే అని సంతోషంగా చెప్తున్నాడు ప్రదీప్.

ఫంక్షన్‎లలో కూడా ప్రత్యేక ఆకర్షణ కోసం తాను సిద్దమేనంటున్న ప్రదీప్..

తన రెగ్యులర్ ప్రదర్శనలతో పాటు, ప్రదీప్ ఫంక్షన్లు, ఈవెంట్లలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైనా తమ ఈవెంట్‌లకు తనను ఆహ్వానించడానికి ఆసక్తి ఉన్న వారు 9083333008, 8080265061 నంబర్లకు ఫోన్ చేయాలని కోరుతున్నాడు. కచ్చితంగా అతిథులను అలరిస్తానని, ఫంక్షన్‎లకు మరింత ఆకర్షణగా మారుతానని నమ్మబలుకుతూ ఉన్నాడు ప్రదీప్.