Telangana: అందరూ గుడికి దేవుడ్ని మొక్కేందుకు వెళ్తే.. వీళ్ల కన్ను మాత్రం వాటి మీదే.!

Telangana: అందరూ గుడికి దేవుడ్ని మొక్కేందుకు వెళ్తే.. వీళ్ల కన్ను మాత్రం వాటి మీదే.!

Ravi Kiran

|

Updated on: May 15, 2024 | 9:36 AM

తెలంగాణలో రెండో భద్రాద్రిగా పేరుగాంచిన వికారాబాద్ జిల్లా జుంటిపల్లి శ్రీ సీతా రామచంద్ర దేవాలయంలో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. ఈ ఘటనలో దొంగలు ఆలయంలోని రెండు హుండీలను పగులగొట్టి నగదు, వెండి వస్తువులను దోచుకెళ్లారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

తెలంగాణలో రెండో భద్రాద్రిగా పేరుగాంచిన వికారాబాద్ జిల్లా జుంటిపల్లి శ్రీ సీతా రామచంద్ర దేవాలయంలో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. ఈ ఘటనలో దొంగలు ఆలయంలోని రెండు హుండీలను పగులగొట్టి నగదు, వెండి వస్తువులను దోచుకెళ్లారు. దీని విలువ లక్ష వరకు ఉండొచ్చని ఆలయ పూజారి తెలిపారు. ఇదిలా ఉండగా ఈ రెండేళ్లలో ఇది ఐదవ చోరీ కావడం గమనార్హం. మరోవైపు సీబీఎస్‌ఈ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఉన్నా అవి పనిచేయడం లేదని తెలిసింది. ఇన్నిసార్లు దొంగతనం జరిగినా.. పోలీసులు దొంగలను పట్టుకోకపోవడంపై.. వారి తీరు పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.