Watch Video: బండెక్కిన బండి సంజయ్.. మేనల్లుడితో షికార్..

Watch Video: బండెక్కిన బండి సంజయ్.. మేనల్లుడితో షికార్..

G Sampath Kumar

| Edited By: Srikar T

Updated on: May 15, 2024 | 10:16 AM

కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మేనల్లుడితో సరదాగా రోడ్లపై షాకారు చేశారు. నిన్న మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యర్థులపై ఫైర్ అయిన సంజయ్ మే 13న పోలింగ్ ముగియడంతో రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయారు. పైగా ఎన్నికల ఫలితాలు విడుదలకు దాదాపు 20 రోజులు ఉండటంతో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు ప్రయత్నిస్తున్నారు.

కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మేనల్లుడితో సరదాగా రోడ్లపై షాకారు చేశారు. నిన్న మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యర్థులపై ఫైర్ అయిన సంజయ్ మే 13న పోలింగ్ ముగియడంతో రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయారు. పైగా ఎన్నికల ఫలితాలు విడుదలకు దాదాపు 20 రోజులు ఉండటంతో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫలితాలు జూన్ 4న విడుదలైన తరువాత తిరిగి తానే పార్లమెంట్ కు ఎంపిక అవుతానని ధీమాగా ఉన్నారు. అయితే ఈ గ్యాప్‎లో ఐస్ క్రీం పార్లర్స్ చుట్టూ బండ్లపై రయ్ రయ్ మంటూ తిరుగుతున్నారు బండి సంజయ్. తన మేనల్లుడు శ్రీనిక్ బాబుతో బండిపై ఎంచక్కా సరదాగా తిరుగుతూ కనిపించారు. ఎన్నికలకు ముందు ప్రచారంతో.. ఎన్నికలనంతరం ఇలా కనిపించి నగరవాసులకు ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. బండి సంజయ్ ను ఇలా చూసిన జనం ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‎గా మరింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

 

 

Published on: May 15, 2024 10:08 AM