AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కాయ్ రాజా కాయ్‌.. ఏపీలో రెచ్చిపోతున్న బెట్టింగ్ రాయుళ్లు.. హాట్ సీట్లు ఇవేనంట..!

ఏపీలో బెట్టింగ్ రాయుళ్లకు పండగొచ్చింది. ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో ఉన్న ఆసక్తిని..సొమ్ము చేసుకుంటున్నారు. కోడిపందేలు తరహాలో ఎన్నికల ఫలితాలు, మోజార్టీపై మూడో కోణాల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. 1:5 రేషియోలో పందేలు కాస్తూ జేబులు నింపుకుంటున్నారు.

Andhra Pradesh: కాయ్ రాజా కాయ్‌.. ఏపీలో రెచ్చిపోతున్న బెట్టింగ్ రాయుళ్లు.. హాట్ సీట్లు ఇవేనంట..!
Andhra Pradesh Politics
Shaik Madar Saheb
|

Updated on: May 15, 2024 | 9:16 AM

Share

ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఎట్టకేలకు EVMలు స్ట్రాంగ్‌ రూమ్‌లకి చేరాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 4 తేదీన డిసైడింగ్ డే కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే టైంలో రాష్ట్ర వ్యాప్తంగా కాయ్ రాజా కాయ్… ఊపందుకుంది. బెట్టింగ్ రాయుళ్లు భారీగా క్యాష్ చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చే పార్టీ ఏదీ? ఎన్నిసీట్లు? ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? ఏ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుంది? ఇలా మూడు కోణాల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు బెట్టింగ్‌ రాయుళ్లు. సిండికేట్‌లుగా మారి కోట్లలో పందాలు కాస్తున్నారు. మరి ముఖ్యంగా కోడిపందేలకు పేరుగాంచిన ఉమ్మడి గోదావరి జిల్లాల్లో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఉండి, కడప జిల్లాలో అభ్యర్థులు, స్థానాలతో పాటు చంద్రబాబు పోటీ చేసిన కుప్పం, నారా లోకేష్ కంటెస్ట్ చేసిన మంగళగిరి, పవన్‌ కల్యాణ్ పోటీచేసిన పిఠాపురంలో మెజార్టీలపై భారీ ఎత్తున పందేలు జరుగుతున్నట్లు సమాచారం..

ముఖ్యంగా చెప్పాలంటే దేశ వ్యాప్తంగా పవన్ కల్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. పిఠాపురంలో గెలుపోటములు ఒకరకమైన బెట్టింగ్‌ అయితే.. ఎక్కువగా మెజార్టీపై లక్షల్లో పందేలు జరుగుతున్నట్లు వినిపిస్తోంది. ఇక లోకేష్ బరిలో ఉన్న మంగళగిరిపై పందేం రాయుళ్లు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం.. గత ఎన్నికల్లో లోకేష్ ఓడిపోవడంతో ఈసారి లోకేష్ గెలుపు పై ఎక్కువగా పందాలు జరుగుతున్నాయి. అటు భీమవరం నియోజకవర్గంపై కూడా పందేలు భారీగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. జనసేన తరపున పులపర్తి రామాంజనేయులు, వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్‌ల మధ్య మెజారిటీపై పందేలు నడుస్తున్నాయి. 20వేలు మెజారిటీ వస్తుందని ఒకరిపై మరొకరు బెట్టింగ్ వేస్తున్నారు. అటు కడప జిల్లాలోను సీట్లు, మెజార్టీలపై జోరుగా బెట్టింగ్‌ నడుస్తోంది.

ఇక ఈసారి ఉండి నియోజకవర్గం అన్ని రకాలుగా హాట్‌సీటుగా మారింది. ఉండి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఈసారి రఘురామ కృష్ణంరాజు పోటీ చేస్తుండటంతో హైప్ క్రియేట్ అయింది. టీడీపీ రెబల్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, వైసీపీ అభ్యర్థి పివియల్ నరసింహరాజు బరిలో ఉండటంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. దీంతో ఉండిలో ఆసక్తికరమైన బెట్టింగ్ జరుగుతుంది. మరీ ముఖ్యంగా.. ఇండిపెండెంట్ శివరామరాజుపై పందేలు భారీగా వేస్తున్నట్లు సమాచారం.. నర్సాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ, వైసీపీ క్యాండిడేట్ ఉమా బాల గెలుపోటములపైన భారీగా బెట్టింగ్ కాస్తున్నారని తెలుస్తోంది.. అటు దెందులూరు అభ్యర్థుల మెజార్టీలపైన కూడా బెట్టింగ్ రాయుళ్లు పందేలు వేస్తున్నారని పేర్కొంటున్నారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీపై 1:5 చొప్పున అంటే లక్షకు 5 లక్షల రూపాయలు బెట్టింగ్ పెడుతున్నారని రాష్ట్ర వ్యాప్తంగా టాక్ వినిపిస్తోంది. చోటా నేతలు, కొందరు వ్యాపారులు మధ్యవర్తుల అవతారమెత్తారని సమాచారం.. ఒకటి నుంచి 5 శాతం కమీషన్‌ డిమాండ్‌ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారితోపాటు ప్రైవేటు ఉద్యోగులు, యువకులు, చిరువ్యాపారులు 50 వేల నుంచి కోటి రూపాయల వరకు పందెం కాస్తున్నట్లు చెబుతున్నారు.. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంపైనే ఎక్కువగా పందాలు జరుగుతున్నాయని.. పేర్కొంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..