AP Rains: ఈ ప్రాంతాలకు పిడుగులతో కూడిన వర్షం.. ఉరుములు, మెరుపులు కూడా.. వెదర్ రిపోర్ట్ ఇదిగో!
ఆగ్నేయ అరేబియా సముద్రం & ఆనుకుని ఉన్న కేరళ నుండి మరఠ్వాడా వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తూర్పు విదర్భ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. నైరుతి రుతుపవనాలు మే 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని..

ఆగ్నేయ అరేబియా సముద్రం & ఆనుకుని ఉన్న కేరళ నుండి మరఠ్వాడా వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తూర్పు విదర్భ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. నైరుతి రుతుపవనాలు మే 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ / నైరుతి గాలులు ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా వీస్తున్నాయి. ఈ క్రమంలోనే ద్రోణి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా మారో ముడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, ఉత్తర కోస్తాలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయి. గంటకు 30 నుండి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. అటు ఈ నెల 21 నుండి రాష్ట్రమంతా సాధారణం కంటే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంది.
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :- ————————————————–
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- ————————————
ఈరోజు ,రేపు, ఎల్లుండి :-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు (గంటకు 40-50 కి మీ వేగంతో)వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- ——————————–
ఈరోజు, రేపు:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.
ఎల్లుండి:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.
రాయలసీమ :- ——————-
ఈరోజు:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.
రేపు, ఎల్లుండి :-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.