Andhra Pradesh: మనుషులు సమీపించినా కట్టు కదలని నెమలి.. ఏంటా పరిశీలించగా షాక్.. అయ్యో పాపం అంటూ..
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయుని పేట గ్రామ సమీపంలో కళ్ళు కనిపించక తిరుగుతున్న నెమలిని స్థానికులు ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు సంరక్షించారు. అటవీశాఖ అధికారులు నెమలిని వారి సంరక్షణలో వైద్యులతో పరీక్షించారు.

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయుని పేట గ్రామ సమీపంలో కళ్ళు కనిపించక తిరుగుతున్న నెమలిని స్థానికులు ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు సంరక్షించారు. అటవీశాఖ అధికారులు నెమలిని వారి సంరక్షణలో వైద్యులతో పరీక్షించారు. నెమలి బలహీనంగా ఉండడంతో కొన్ని రోజులపాటు వైద్యం అందించి నెమలి కోలుకున్న తర్వాత సంజీవరాయుని పేట సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు నెమలిని విడిచిపెట్టారు. అయితే నెమలికి కళ్ళు కనిపించడం లేదని అది ఎటు వెళ్లలేక పోతుందని అధికారులు అన్నారు. అటవీ ప్రాంతంలోనే నెమలిని పర్యవేక్షిస్తున్నామని నెమలి ఎటు వెళ్లలేని పరిస్థితి ఉంటే తర్వాత నెమలి సంరక్షణ బాధ్యత తీసుకుంటామని అటవీశాఖ అధికారులు తెలిపారు.
ఆ నెమలికి కళ్ళు ఎందుకు పోయాయి..
వేటగాళ్లు నెమలిని పట్టుకునేందుకు పెట్టిన ఆహారం తిని కళ్ళు పోగొట్టుకుందా.. పుట్టుకతోనే కళ్ళు కనిపించవా.. లేక ఈమధ్య చూపు పోగొట్టుకుందా.. కారణం ఏమై ఉంటుంది.. ఈ ప్రశ్నలే ఇప్పుడు అటవీశాఖ అధికారులను కలవర పెడుతున్నాయి. చూడముచ్చటగా ఉన్న ఆ జాతీయ పక్షి నెమలి కళ్ళు కనిపించక అడవి నుంచి గ్రామంలోకి వచ్చింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయపేట సమీపంలో ఓ నెమలి గ్రామ పరిసర ప్రాంతాలలో తిరుగుతున్న విషయాన్ని స్థానిక ప్రజలు గుర్తించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు నెమలిని పట్టుకొని పరీక్షించారు. నెమలిని పట్టుకునే సమయంలో అది పారిపోకుండా అక్కడే నిలబడటం, కనీసం కదలకుండా అక్కడే ఉండటం గమనించారు అటవీ సిబ్బంది. అనుమానం వచ్చి నెమలి కళ్ళను పరీక్షించారు. నెమలికి కళ్ళు కనిపించడం లేదని గుర్తించారు. అటవీశాఖ అధికారుల సంరక్షణలో వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో నెమలికి చికిత్స ప్రారంభించారు. నెమలికి చికిత్స అందించిన తరువాత కూడా దానికి కళ్ళు కనిపించడం లేదని గుర్తించారు. ప్రస్తుతం నెమలి ఆరోగ్యం బాగానే ఉండటంతో దాన్ని అటవీప్రాంతంలో విడిచిపెట్టారు. అయితే అది ఎటూ వెళ్ళలేకపోతుండటంతో దాని చూపు తిరిగిరాలేదని గ్రహించి అటవీసిబ్బంది నెమలిని ఓ కంట కనిపెడుతున్నారు. చూపు కనిపించక ఆహారం కూడా సేకరించుకోలేని పరిస్థితిలో ఉంటే నెమలిని తిరిగి తమ సంరక్షణలోకి తీసుకుంటామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..