Andhra Pradesh: కిరాణా సామాను కొనుగోలు చేస్తున్నారా? అయితే, ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్త..!
ఏపీలో కొత్త కొత్త మోసాలు బయటపెట్టారు తూనికలు, కొలతల శాఖ అధికారులు. పలు జిల్లాల్లోని కిరాణా షాపుల్లో తనిఖీలు చేయగా.. తూకాల్లో హెచ్చుతగ్గులు ఉన్నట్లు వెల్లడైంది. అటు.. విశాఖలో పెద్దమొత్తంలో విదేశీ సిగరెట్లను సీజ్ చేశారు విజిలెన్స్ అధికారులు. ఏపీ తూనికలు, కొలతల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వ్యాపార దుకాణాల్లో ఆ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఏపీలో కొత్త కొత్త మోసాలు బయటపెట్టారు తూనికలు, కొలతల శాఖ అధికారులు. పలు జిల్లాల్లోని కిరాణా షాపుల్లో తనిఖీలు చేయగా.. తూకాల్లో హెచ్చుతగ్గులు ఉన్నట్లు వెల్లడైంది. అటు.. విశాఖలో పెద్దమొత్తంలో విదేశీ సిగరెట్లను సీజ్ చేశారు విజిలెన్స్ అధికారులు. ఏపీ తూనికలు, కొలతల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వ్యాపార దుకాణాల్లో ఆ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా.. కందిపప్పు, బియ్యం, నూనె విక్రయ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. కిరాణా, సూపర్ మార్కెట్లు, హోల్‌సేల్, రిటైల్ దుకాణాల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా.. దుకాణాల్లో తక్కువ తూకం, ప్యాకింగ్ ఉత్పత్తులపై ముద్రిత ధరలు కంటే ఎక్కువకు విక్రయించడం, తయారు తేదీ, ఎంఆర్‌పీలు ముద్రించకపోవడం లాంటి అంశాలు గుర్తించారు. నిత్యావసర, కిరాణా దుకాణాల్లో సరుకులకు సంబంధించి పలువురు ప్యాకేజి, కమోడిటీ రూల్స్ అతిక్రమించినట్లు గుర్తించారు కృష్ణా జిలా లీగల్ మెట్రాలజీ అధికారులు.
ఈ క్రమంలోనే.. తూకం తక్కువ వేసి మోసం చేస్తున్న 41 మందిపై కేసులు నమోదు చేశారు. వాస్తవానికి.. తూనికలు, కొలతల యంత్రాలతో వ్యాపారాలు చేసేవారు కచ్చితంగా ప్రతి ఏటా ఆ శాఖ నుంచి ఆయా పరికరాలు సక్రమంగా ఉన్నట్లు స్టాంపింగ్ ఉండాలి. ఒకవేళ ఆ యంత్రాల్లో లోపాలు ఉంటే సరి చేయించుకోవాలి. తూకానికి పాత కేజీ రాళ్లు వినియోగించడతోపాటు.. తూకంలోని పళ్లెం కింద లోహపు వస్తువులు ఉంచి కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు.. జనాలకు విక్రయించే ప్యాకెట్లపై బ్యాచ్ నంబర్, గడువు, తయారు చేసే సంస్థ అడ్రస్, ఎంఆర్‌పీలు కూడా ఉండటం లేదు. ఇలాంటి మోసాలపై ఫిర్యాదులు రావడంతో తూనికలు, కొలతల శాఖ అధికారులు రైడ్స్ చేశారు. ఇదిలావుంటే.. విశాఖ డాబా గార్డెన్స్‌లోని పలు షాపుల్లో విజిలెన్స్ అధికారులు.. ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో.. అనధికారికంగా విక్రయిస్తున్న విదేశీ సిగరెట్లను పెద్దమొత్తంలో సీజ్ చేశారు. దానికి సంబంధించి కేసులు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..