Andhra Pradesh: జల ప్రళయానికి ఏడాది.. ఇప్పటికీ నిలువ నీడ లేని వైనం.. అన్నమయ్య డ్యామ్ వరద బాధితుల ధీన స్థితి..
కళకళలాడిన పల్లెసీమ గ్రామాలపై వరద కన్నెర్ర చేసింది. అన్నమయ్య డ్యాం వరద తాండవానికి 30 మంది, పంటపొలాలు, పశువులు బలయ్యాయి.
కళకళలాడిన పల్లెసీమ గ్రామాలపై వరద కన్నెర్ర చేసింది. అన్నమయ్య డ్యాం వరద తాండవానికి 30 మంది, పంటపొలాలు, పశువులు బలయ్యాయి. జళప్రళయం సృష్టించి ఏడాదైనా.. నిలువ నీడ లేక పరదాల మాటున జీవనం సాగిస్తున్నారు భాదితులు. చిద్రమైన జీవితాలతో.. దాతల సాయంతో జీవనం సాగిస్తున్నారు.
రాయలసీమలోని అన్నమయ్య జిల్లా రాజంపేట చెయ్యేరు నది పరివాహక ప్రాంతం.. ఏడాది క్రితం పచ్చని పొలాలు మూడు పంటలతో కోనసీమను తలపించేది. సరిగ్గా ఏడాది క్రితం నవంబర్ 19న జరిగిన జల ప్రళయానికి అంతా తుడిచి పెట్టుకుపోయింది. అన్నమయ్య డ్యాం మట్టికట్ట కొట్టుకుపోవడంతో చెయ్యేరు నది పరివాహక ప్రాంతంలోని పులపత్తూరు, మందపల్లె, గుండ్లూరు, తొగురు పేట ఏడారిని తలపిస్తున్నాయి. ఇసుక దిబ్బలు, శిధిలాలు అలాగే కనిపిస్తున్నాయి. నిలువ నీడ లేక విషపు పురుగుల మధ్యే బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు పులపత్తూరు గ్రామస్థులు. పునరావాసం, ఆర్థిక సహాయం పై ప్రభుత్వం ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదని వాపోతున్నారు బాధితులు. 250 ఇళ్లులు వరద ఉధృతికి నేలమట్టమైన.. పుట్టిన గడ్డను వదిలి వెళ్లలేక అక్కడే జీవనం సాగిస్తున్నారు.
కుటుంబ సభ్యులు, పశువులు, పంటపొలాలు తుడిచిపెట్టుకుపోవండంతో ఆదుర్ఘటనను తలచుకొని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కోనసీమగా పేరొందిన మా ప్రాంతం ఇప్పుడు ఎడారిగా మారిందంటూ బరువెక్కిన హృదయంతో బాధపడుతున్నారు బాధిత గ్రామాల ప్రజలు.
ఏడాదిగా ఇబ్బందులు పడుతున్నా అధికారులు మావైపు కన్నేత్తి చూడటం లేదని వాపోతున్నారు బాధిత గ్రామాల ప్రజలు. ఇచ్చిన హామీల్లో ఏఒక్కటి నెరవేర్చలేదని .. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు బాధిత గ్రామాల ప్రజలు. చేయడానికి పనిలేక ..పోలాల్లో ఇసుక మేటలు తొలగించే స్తోమత లేక ప్రభుత్వ సాయం కోసం వేచి చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కరకట్ట నిర్మించి.. ఇసుక మేటలు తొలగించి.. పొలాల్లో బోర్లు వేయిస్తే మునుపటి జీవనం సాగిస్తామని విజ్ఞప్తి చేస్తున్నారు అన్నమయ్య డ్యాం వరద బాధితులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..