Andhra Pradesh: ఏపీలో రెచ్చిపోతున్న మెడికల్ మాఫియా.. భారీగా నకిలీ మందులు సీజ్
రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది. మార్కెట్లో భారీగా డూప్లికేట్ మందులు చలామణిలో ఉన్నాయి. పబ్లిక్ రెగ్యులర్ గా వాడే అన్ని మందుల్లో కల్తీలు వచ్చేసాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్స్ ,డ్రగ్ ఏజెన్సిస్,ఫార్మాసిలో డ్రగ్ కంట్రోలర్ తనిఖీల్లో భారీగా ఫెక్ మందుల వ్యవహారం బయటపడింది. ప్రముఖ బ్రాండ్స్‌కు సంబంధించిన చాల మందులను డూప్లికేట్వి చేసి అమ్మేస్తున్నారు కేటుగాళ్ళు.
రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది. మార్కెట్లో భారీగా డూప్లికేట్ మందులు చలామణిలో ఉన్నాయి. పబ్లిక్ రెగ్యులర్ గా వాడే అన్ని మందుల్లో కల్తీలు వచ్చేసాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్స్ ,డ్రగ్ ఏజెన్సిస్,ఫార్మాసిలో డ్రగ్ కంట్రోలర్ తనిఖీల్లో భారీగా ఫెక్ మందుల వ్యవహారం బయటపడింది. ప్రముఖ బ్రాండ్స్‌కు సంబంధించిన చాల మందులను డూప్లికేట్వి చేసి అమ్మేస్తున్నారు కేటుగాళ్ళు. రెగ్యులర్‌గా వాడే కార్డియాక్ ,ఫీవర్ ,అల్సర్ ,బీపీ, షుగర్, గ్యాస్, పెయిన్ లాంటి అన్ని మందులో కల్తీ వచ్చేసాయి. భారీ ఎత్తున డూప్లికేట్ మందులు గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేసారు. ఇందులో పలువురు వ్యాపారులపై కేసులు కూడా నమోదు చేసారు. హైదరాబాద్ నుండి విజయవాడ గుంటూరు ,నెల్లూరు లాంటి మేజర్ సిటీలకు ఈ ఫెక్ మందులు సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. అనుమానం ఉన్న మందుల శాంపుల్స్ తీసి ల్యాబ్ కు పంపుతున్నారు అధికారులు.
ఈ డూప్లికేట్ మందులను తక్కువ ధరకు కొనుగోలు చేసి స్టాండెస్ బ్రాండెడ్ మందులంటూ అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. రీకాల్ చేయబడిన స్టాక్ అన్ని నమూనాలను విశ్లేషణ కోసం డ్రగ్ కంట్రోల్ లాబొరేటరీకి పంపారు. గతంలో కోడెయిన్ సిరాప్స్ మిస్ యూజ్ అయినా సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు కూడా నార్కోటిక్ డ్రాగ్ ఉన్న మెడిసిన్స్ ను ఎలాంటి బిల్స్ లేకుండా అమ్మేస్తున్నారు వ్యాపారాలు. విచ్చలవిడిగా లైసెన్స్ లేని మెడికల్ షాప్స్ బిల్ లేని మందులు అమ్మకాలు ,కొనుగోలు జరుగుతున్నట్లు గుర్తించారు. మత్తుకు బానిసైన వారికీ బిల్స్ లేకుండానే డ్రగ్స్ కంటెంట్ ఉన్న మందుల అమ్మేస్తున్నారు. బెజవాడలో కూడా భారీగా నకిలీ మందులు బయటపడ్డాయి. వన్ టౌన్ ,గొల్లపూడిలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు చేశారు. తనిఖీల్లో భారీగా నకిలీ మందులు బయటపడ్డాయి.
గొల్లపూడి ,వాసవి ఫార్మా కాంప్లెక్ ,వన్ టౌన్ లో నకిలీ మందులు గుర్తించారు. తక్కువ ధరకు హైదరాబాద్ నుండి కొనుగోలు చేసి అమ్మకాలు జరుగుతున్నట్లుగా నిర్దారించారు. లైసెన్స్ లేని వ్యక్తులు వ్యాపారం చేసిన అనధికారికంగా మందులు అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఏ బిల్స్ లేకుండా మందులు కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నారు హోల్ సెల్ వ్యాపారులు. ఇలా అమ్మకాలు చేస్తున్న కృష్ణ మూర్తి ,నీలి కుమార్ అనే ఇద్దరు వ్యక్తులపై కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
బెజవాడలో బయటపడ్డ ప్రముఖ కంపెనీలకు సంబందించిన కల్తీ మందుల లిస్ట్
Zerodol SP టాబ్లెట్లు-FND08204, Omez D క్యాప్సూల్స్-E2202549, IPCA లేబొరేటరీస్-డా.రెడ్డీస్ లాబొరేటరీస్, పాన్‌టాప్ DSR క్యాప్సూల్స్- SPG22104, అరిస్టో ఫార్మాస్యూటికల్స్, రోసువాస్ 10-SID3056A, SIE0021A, SIEOL16A సన్ ఫార్మా లాబొరేటరీస్ లిమిటెడ్, రోసువాస్ 20mg మాత్రలుSID2213A, SIE0085A, రోసువాస్ 40mg టాబ్లెట్లు- SID1951A, SIE0022A, Gluconorm Gluconorm20 Gluconorm6 U300143, గ్లూకోనార్మ్ G2 టాబ్లెట్‌లు-U202610,U300577 లుపిన్ లిమిటెడ్, గ్లూకోనార్మ్ G4 ఫోర్టే టాబ్లెట్‌లుU201992,UJ00043,N2201549, గబాపిన్ NT టాబ్లెట్‌లు -ఇంటాస్ ఫార్మాస్యూటికల్స్-201220200120 టెల్మా 40ఎంజి, మాత్రలు- 18220890 గ్లెన్‌మార్క్, టెల్మా హెచ్ టాబ్లెట్లు-18220172 18220197 గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, టెల్మా AM టాబ్లెట్లు-18230073, చైమోరల్ ఫోర్టే టాబ్లెట్లు-2KU6J025, 2KU6K003, Flavedon MR టాబ్లెట్లు-RV052204,ME052202,RV052211 సర్వియర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అమరిల్ M2 టాబ్లెట్‌లు-3NG403 సనోఫీ ఇండియా లిమిటెడ్.