Udyanidhi Stalin: సనాతన ధర్మంపై ఆగని వివాదం.. ఉదయనిధి స్టాలిన్‌ను చెప్పుతో కొడితే రూ.10 లక్షల బహుమతి
ఇటీవల తమిళనాడు మంత్రి ఉదయ నిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మాన్ని ఆయన కరోనా, మలేరియా, డెంగ్యూ లతో పోల్చారు. అలాగే ఈ సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని.. దీన్నీ సమూలంగా నాశనం చేయాలంటూ అన్నారు. దీంతో ఆయన అన్న మాటలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. దీంతో హిందూ సంఘాల నేతలు ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఇటీవల తమిళనాడు మంత్రి ఉదయ నిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మాన్ని ఆయన కరోనా, మలేరియా, డెంగ్యూ లతో పోల్చారు. అలాగే ఈ సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని.. దీన్నీ సమూలంగా నాశనం చేయాలంటూ అన్నారు. దీంతో ఆయన అన్న మాటలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. దీంతో హిందూ సంఘాల నేతలు ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దీంతో ఉదయనిధికి వ్యతిరేకంగా ఒకవర్గం.. మద్ధతుగా మరో వర్గం మీడియాలో, సోషల్ మీడియాలో వాదనలు చేసుకుంటున్నారు. మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉదయ నిధి స్టాలిన్ మాట్లాడారని.. తన మాటలతో రెండు మతపరమైన వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగట్టే ప్రయత్నం చేశారన్న ఆరోపణలతో ఆయనపై ఉత్తర ప్రదేశ్‌లో కేసు కూడా నమోదైంది.
అయితే ఈ సనాతన ధర్మ వివాదంపై ప్రధానీ మోదీ కూడా స్పందించారు. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు సరైన విధంగా స్పందించాలని మంత్రులకు కూడా ఆయన దిశా నిర్దేశం చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని కామెంట్స్ చేసిన స్టాలిన్.. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వనించకుండా బీజేపీ ప్రభుత్వం విస్మరించడం సనాతన ధర్మంలోని వివక్షకు ప్రతిరూపం అని కూడా అన్నారు. అయితే స్టాలిన్ ఈ కామెంట్స్ చేసిన తర్వాతి రోజు ప్రధాని మోదీ స్పందించారు. మరో వైపు స్టాలిన్ తన చేసిన వ్యాఖ్యలను కూడా సమర్ధించుకున్నారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం కొనసాగిస్తామని అన్నారు. అలగే తాను చేసిన వ్యాఖ్యలని కొందరు వక్రీకరిస్తున్నారని.. తాను కుల బేధాలు నశించాలని అన్నట్లు తాజాగా పేర్కొన్నారు. కేవలం హిందుత్వలోనే కాకుండా అన్న మతాల్లో కూడా ఈ భేదాలు పోవాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.
అయితే బీజేపీ, ఆర్ఎస్‌ఎస్, సంఘాలు మాత్రం స్టాలిన్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశాయి. కానీ ఉదయనిధి మాత్రం క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. తన వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకున్న కూడా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు తమిళనాడు గవర్నర్ అనుమతి తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఉదయనిధి స్టాలన్ చేసిన వివాదస్పద వ్యాఖ్యల సెగ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు తాకింది. సనాతన ధర్మంపై స్టాలిన్ అనుచితంగా మాట్లాడటం వల్ల ఆయన్ని ఎవరైనా చెప్పుతో కొడితే.. పది లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తామంటూ బ్యానర్లు ఏర్వాటు చేశారు. అలాగే స్టాలిన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్ అయోధ్యకు చెందిన ఓ స్వామీజీ ఉదయనిధి తలను తీసుకొస్తే 10 కోట్ల రూపాయల రివార్డు ప్రకటించడం కూడా సంచలనం సృషించిన సంగతి తెలిసిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..