Nellore Politics: సింహపూరిలో పీక్స్‌కు చేరిన పొలిటికల్ వార్.. ‘మేకపాటి’ కుటుంబంలో రాజకీయ వే‘ఢీ’
Mekapati Family Politics: ఆ నియోజకవర్గంలో పొలిటికల్ గా ఆ కుటుంబానిదే హవా.. ప్రత్యర్థి ఎవరైనా వారి హవాను తట్టుకోవడం కాస్త కష్టమే అనేంతగా సాగేవి వారి పాలిటిక్స్.. కానీ ఇపుడు అక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది..
Mekapati Family Politics: ఆ నియోజకవర్గంలో పొలిటికల్ గా ఆ కుటుంబానిదే హవా.. ప్రత్యర్థి ఎవరైనా వారి హవాను తట్టుకోవడం కాస్త కష్టమే అనేంతగా సాగేవి వారి పాలిటిక్స్.. కానీ ఇపుడు అక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.. కారణం.. ఇద్దరు సోదరులు చెరో పార్టీ నుంచి ఫైట్ చేసే పరిస్థితి వచ్చింది.. సిట్టింగ్ ఎమ్మెల్యే టిడిపి వైపు ఉండగా.. ఆయన తమ్ముడు వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతుండడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న ఆనం కుటుంబంలో చీలిక వచ్చింది.. రామనారాయణ రెడ్డి ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీ వైపు వెళ్లారు.. ఆనం రామనారాయణ రెడ్డి అన్న కుమారుడు వెంకటరమణ రెడ్డి కూడా టిడిపిలోనే ఉన్నారు.. రామనారాయణ రెడ్డి ఇద్దరు తమ్ముళ్లు వైసీపీలో ఉన్నారు.. ఆనం విజయ్ కుమార్ రెడ్డి సతిమణికి జడ్పీ చైర్మన్ పదవి దక్కింది.. మరో సోదరుడు జయ కుమార్ రెడ్డి టిడిపి నుంచి వైసీపీలో చేరారు.. ఇలా చెరో సగం అన్నట్లుగా ఆనం కుటుంబం రెండుగా చీలింది. ఇప్పుడు అదే జిల్లాలో మరో బలమైన పొలిటికల్ ఫ్యామిలిలో కూడా ఇదే పరిస్థితి వచ్చింది.. ఇటీవల ఏపీ రాజకీయాల్లో నలుగురు ఎమ్మెల్యేల తిరుగుబాటు తర్వాత పరిణామాలు వేగంగా మారాయి.. అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లాకు చెందిన వారు.. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.
నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబానికి పోలిటికల్ గా మంచి చరిత్ర ఉంది.. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న మేకపాటి కుటుంబం నుంచి రాజమోహన్ రెడ్డి తొలుత 1985 లో ఉదయగిరి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.. ఆతర్వాత లోక్‌సభకు వెళ్లిన రాజమోహన్ రెడ్డి రెండో తమ్ముడిని ఎమ్మెల్యేగా పోటీ చేయించారు.. 2014 లో రాజమోహన్ రెడ్డి ఎంపీగా , కుమారుడు ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 లో రాజమోహన్ రెడ్డి పోటీకి దూరంగా ఉండగా గౌతమ్ రెడ్డి ఆత్మకూరు , ఉదయగిరి నుంచి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.. అయితే ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కి పాల్పడి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల్లో చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. దీంతో పార్టీపై విమర్శలు చేసిన చంద్రశేఖర్ రెడ్డి టీడీపీతో జతకలిసారు. జిల్లాలో, నియోజకవర్గంలో వైసీపీ ని ఓడించి పదికి పది స్థానాల్లో టీడీపీని గెలిపిస్తామని శపథం చేశారు. త్వరలో ఉదయగిరి నియోజకవర్గంలో జరగనున్న లోకేష్ యువగళం లో మేకపాటి వ్యవహరించిన తీరు.. జగన్ పై చేసిన హాట్ కామెంట్స్ తో టిడిపి లో జోష్ తెచ్చింది.
ఇక మేకపాటి మరో సోదరుడు మేకపాటి రాజ గోపాల్ రెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది.. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి కూడా రాజగోపాల్ రెడ్డి దాదాపు ఖరారుగా పార్టీ చెబుతోంది. దీంతో ఈ ఇద్దరు అన్న దమ్ముల మధ్య ఫైట్ తప్పనిసరి కాబోతోంది. అయితే వైసీపీ ఇంచార్జ్ గా రాజగోపాల్ రెడ్డి ని ఇంచార్జ్ గా నియమించక ముందు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అలా ఉంటే .. ఇపుడు తమ్ముడు వైసీపీ అభ్యర్థిగా ఉన్న పరిస్థితుల్లో కూడా చంద్రశేఖర్ రెడ్డి దూకుడుగా ఉండడం.. జిల్లాలో వైసీపీని వీడిన కోటంరెడ్డి, ఆనంకు టిడిపి అభ్యర్థులుగా ఖరారు చేసిన క్రమంలో మేకపాటి కి కూడా అవకాశం ఇస్తే పోరు ఇద్దరు అన్నదమ్ముల మధ్య తప్పదు అని పేర్కొంటున్నారు.
అయితే, ఎమ్మెల్యే చంద్రశేఖర్ వైఖరి ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది.. మేకపాటి కుటుంబం ఇన్నాళ్లు మరొకరితో తలపడితే.. ఇపుడు మేకపాటి కుటుంబంలోని ఇద్దరు సోదదులే తలపడేందుకు సిద్దామవుతున్నారా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..