Andhra Pradesh: ఆ పేపర్ అమ్మితే కఠిన చర్యలు.. వ్యాపారులకు డీఎస్సీ సీరియస్ వార్నింగ్.. ఆ పేపర్ ఏంటంటే..!
తెనాలిలో ఆ పేపర్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం.. వ్యాపారులు ఆ పేపర్‌ను ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవద్దు. కొనుగోలు చేసి తెనాలిలో విక్రయించడం నేరం అంటూ తెనాలి డిఎస్పీ జనార్థన రావు చెప్పారు. మరి ఇంతకీ ఆ పేపర్ ఏంటా అని అనుకుంటున్నారా.. అయితే ఈ గంజాయి గురించి తెలుసుకోవాల్సిందే..
తెనాలిలో ఆ పేపర్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం.. వ్యాపారులు ఆ పేపర్‌ను ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవద్దు. కొనుగోలు చేసి తెనాలిలో విక్రయించడం నేరం అంటూ తెనాలి డిఎస్పీ జనార్థన రావు చెప్పారు. మరి ఇంతకీ ఆ పేపర్ ఏంటా అని అనుకుంటున్నారా.. అయితే ఈ గంజాయి గురించి తెలుసుకోవాల్సిందే.. గతంలో గంజాయి త్రాగడానికి ప్రత్యేకంగా పైప్స్ ఉపయోగించేవారు. అయితే మట్టితో తయారయ్యే పైప్స్ ఇప్పుడు మార్కెట్లో లభ్యం కావటం లేదు. మరొకవైపు గంజాయి సిగరెట్లు విచ్చలవిడిగా లభ్యం అవుతున్నాయి. కాని గంజాయి కొని తాగేవారికి మాత్రం ఇబ్బంది తప్పటం లేదు. ఈ క్రమంలోనే గంజాయి త్రాగేందుకు సిగరెట్ పోలిన పేపర్ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చింది. తెనాలిలో కొంతమంది వ్యాపారులు దీన్ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి గంజాయి సేవించే వారికి విక్రయిస్తున్నారు.
అయితే ఈవిషయం పోలీసులకు ఎలా తెలిసిందనుకుంటున్నారా.. రెండు రోజుల క్రితం గంజాయి విక్రయిస్తున్న వారిని తెనాలి పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద గంజాయితో పాటు కొన్ని సిగరెట్ ను పోలిన పేపర్స్ బయటపడ్డాయి. అవి ఏంటా అని విచారించిన పోలీసులకు నిందితులు అసలు విషయం చెప్పేశారు. గంజాయి త్రాగటానికి ప్రత్యేకంగా తయారు చేసిన సిగరెట్‌ను పోలిన పేపర్ పైప్ లని చెప్పారు. దీంతో పోలీసులు విస్తుపోయారు. గంజాయి విక్రయదారులు కొత్త కొత్త ఆలోచనలు బయటపడేసరికి పోలీసులు అప్రమత్తమయ్యారు. తెనాలికి చెందిన ఏ వ్యాపారులైనా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వాటిని స్థానికంగా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని తెనాలి డిఎస్పీ జనార్థన రావు హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..