AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఒంగోలులో దారుణం.. వ్యక్తిని చావబాది, నోట్లో మూత్రం పోసిన యువకులు.. పట్టించుకోని పోలీసులు..!

Ongole, July 19: ఒంగోలులో నెలరోజుల క్రితం జరిగిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాత గొడవల నేపథ్యంలో ఓ వ్యక్తి చావబాది, నోట్లో మూత్రం పోశారు కొంతమంది యువకులు. తీవ్ర గాయాలతో, రక్తమోడుతుండగా బాధితుడి పోలీసులను ఆశ్రయించాడు. తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశాడు.

Andhra Pradesh: ఒంగోలులో దారుణం.. వ్యక్తిని చావబాది, నోట్లో మూత్రం పోసిన యువకులు.. పట్టించుకోని పోలీసులు..!
Ongole
Fairoz Baig
| Edited By: Shiva Prajapati|

Updated on: Jul 19, 2023 | 9:12 AM

Share

Ongole, July 19: ఒంగోలులో నెలరోజుల క్రితం జరిగిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాత గొడవల నేపథ్యంలో ఓ వ్యక్తి చావబాది, నోట్లో మూత్రం పోశారు కొంతమంది యువకులు. తీవ్ర గాయాలతో, రక్తమోడుతుండగా బాధితుడి పోలీసులను ఆశ్రయించాడు. తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశాడు. అయితే, కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. నిందితులు, బాధితుడు జులాయిలు కావడం, చోరీలకు పాల్పడేవారు కావడంతో పోలీసులు లైట్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే యువకుడ్ని చితకబాది, నోట్లో మూత్రం పోసిన దృశ్యాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం కావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. హాడావిడిగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో కొంతమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

ఈ ఘటన తాలూకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలుకు చెందిన కొంతమంది యువకులు జులాయిలుగా తిరుగుతూ ఈజీ మనీ కోసం నేరాలకు పాల్పడుతున్నారు. ఇళ్ళల్లో చోరీలకు పాల్పడుతూ దోచుకున్న సొమ్ముతో జల్సాలు చేసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ క్రమంలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులు నవీన్‌, అంజిల మధ్య చిన్నపాటి గొడవ మనస్పర్దలకు దారి తీసింది. ఈ క్రమంలో నెలరోజుల క్రితం ఒంగోలు శివారులో వీరిద్దరితో పాటు మరికొంతమంది యువకులు కలిసి మద్యం సేవించారు. వీరిలో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారు. ఒంగోలు నగరంతో పాటు బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన కొంతమంది యువకులు ఉన్నారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న అంజి తనతో గతంలో గొడవపెట్టుకున్న నవీన్‌పై గొడవకు దిగాడు. అతనికి మిగతా యువకులు సహకరించారు. నవీన్‌ను విచక్షణా రహితంగా కొట్టారు. తీవ్ర గాయాలతో రక్తం కారుతూ నవీన్‌ విలవిల్లాడుతున్నా కనికరం చూపలేదు. పైశాచికత్వం ఇంకా కట్టలు తెంచుకుంది. బాధితుడిపై మూత్రం పోశారు. నోట్లో మూత్రం పోసి, తాగాలంటూ చావగొట్టారు. తనను వదిలేయాలంటూ బాధితుడు కాళ్లావేళ్లా పడి వేడుకున్నా వినిపించుకోలేదు. బూతులు తిడుతూ కసిగా కొట్టారు. అంతే కాకుండా ఈ దారుణాన్ని తమ దగ్గర ఉన్న సెల్‌ఫోన్లో రికార్డు చేశారు. ఈ ఘటన జరిగిన తరువాత బాధితుడు ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాధితుడు, నిందితులు అంతా నేర ప్రవృత్తి కలిగి ఉండటం, అంతా దొంగలేనని, వీరి మధ్య గొడవలు సాధారణమేనన్నట్టు లైట్‌ తీసుకున్నారు. అయితే నెల రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోను నిందితుల్లోనే కొంతమంది సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో నెట్టింట హల్‌చల్‌ చేయడంతో అప్రమత్తమై పోలీసులు…

నెల రోజుల క్రితం జరిగిన ఈ వ్యవహారంపై బాధితుడు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దాడి, ఎస్సీ, ఎస్టీ కేసుగా నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. వీరంతా పాత నేరస్థులు కావడం వీరిపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ల పరధిలో 40కి పైగా చోరీ కేసులు ఉన్నట్టు గుర్తించారు. నిందితుల మధ్య తరచూ మద్యం మత్తులో గొడవలు జరుగుతుంటాయని తేల్చారు. దీంతో నిందితులను విచారించడం, అరెస్టు చేయడం వంటి చర్యలు చేపట్టలేదు. దీంతో తమకేమీ కాదన్న ధోరణిలో ఉన్న నిందితుల్లో కొంతమంది తాము రికార్డు చేసిన దాడి దృశ్యాలను సోషల్‌ మీడియాలో పెట్టడంతో అది వైరల్‌గా మారి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమై నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఒంగోలు డిఎస్‌పి నారాయణస్వామి రెడ్డి ఆధ్వర్యంలో ఈ కేసులో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..