AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vidadala Rajini: చంద్రబాబు ప్రచార పిచ్చికి జనం బలవుతున్నారు.. మంత్రి విడదల రజిని సంచలన వ్యాఖ్యలు..

చంద్రన్న సంక్రాంతి కానుకల పంపణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగిన సంఘటనపై మంత్రి విడదల రజనీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రచార యావకి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు.

Vidadala Rajini: చంద్రబాబు ప్రచార పిచ్చికి జనం బలవుతున్నారు.. మంత్రి విడదల రజిని సంచలన వ్యాఖ్యలు..
Vidadala Rajini
Shaik Madar Saheb
|

Updated on: Jan 02, 2023 | 8:10 AM

Share

చంద్రబాబు నాయుడు గుంటూరు సభలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. పలువురు గాయలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, చంద్రన్న సంక్రాంతి కానుకల పంపణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగిన సంఘటనపై మంత్రి విడదల రజనీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రచార యావకి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని మంత్రి విడదల రజిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అనంతరం ఈ ఘటనపై ప్రకటన విడుదల చేశారు. ‘‘చంద్రబాబు నాయుడు ప్రచార యావకి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోవటం చాలా బాధాకరం. ఏదో చేసేస్తున్నట్లు, ప్రచార ఆర్భాటాలు చేశారు. గత పది రోజులుగా ఇక్కడేదో పంచుతున్నారని ఒక ఫేక్‌ ప్రచారాలు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి వాహనాలు పెట్టి జనాలను మభ్యపెట్టి ఇక్కడి తీసుకొచ్చారు. గోరంత ఇచ్చి కొండంత అని చెప్పుకునే ప్రయత్నంలో తొక్కిసలాట జరిగింది. కేజీ కందిపప్పు, అరకేజీ నూనె ఇచ్చి ఏదో అన్ని సరుకులు ఇచ్చినట్లు ప్రచారం చేసుకున్నారు. మొన్న కందుకూరులో 8 మంది మరణించారు. ఇప్పుడు గుంటూరులో ముగ్గురు. ఈ చావులన్నింటికీ కూడా చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలి’’.. అని విడదల రజిని టీడీపీ, చంద్రబాబుపై మండిపడ్డారు.

అయితే ముఖ్యమంత్రి వైస్ జగన్ కూడా ఈ సంఘటన పై దిగ్బ్రాంతి వ్యక్తం చేసారని మంత్రి రజని తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం అందించాలని, గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి రజని తెలిపారు.

కాగా, గుంటూరు తొక్కిసలాట ఘటనపై నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఉయ్యూరు ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావుపై 304,174 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు బాధితులకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. 13 మందిలో ఇప్పటికే 9 మంది డిశ్చార్జ్‌ కాగా.. మరో నలుగురికి చికిత్స కొనసాగుతోంది. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..