Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: శిక్షణ ఇస్తుండగా ట్రైనర్‌పైనే అటాక్‌ చేసిన పెద్ద పులి.. వామ్మో వీడియో చూస్తే గజగజ వణికిపోవాల్సిందే.. 

పులులు చాలా ప్రమాదకర జంతువులు.. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే క్షణంలోనే ప్రాణాలు తీస్తాయి.. అయితే, పులి దాడులకు సంబంధించిన వీడియోలను చాలానే చూసుంటారు. కానీ..

Viral Video: శిక్షణ ఇస్తుండగా ట్రైనర్‌పైనే అటాక్‌ చేసిన పెద్ద పులి.. వామ్మో వీడియో చూస్తే గజగజ వణికిపోవాల్సిందే.. 
Tiger Attacked On Trainer
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 01, 2023 | 9:05 PM

పులులు చాలా ప్రమాదకర జంతువులు.. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే క్షణంలోనే ప్రాణాలు తీస్తాయి.. అయితే, పులి దాడులకు సంబంధించిన వీడియోలను చాలానే చూసుంటారు. కానీ.. ఈ వీడియో మాత్రం దానికి భిన్నంగా ఉంది. ఓ పార్క్ లోని పులి.. సొంత శిక్షకుడిపైనే దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. సర్కస్ బోనులో ట్రైనర్ శిక్షణిస్తుండగా.. పులి వెనుక నుంచి అకస్మాత్తుగా దాడి చేసింది. ఈ ఘటనలో ట్రైనర్ తీవ్రంగా గాయపడ్డాడు. మీడియా నివేదికల ప్రకారం.. ఈ సంఘటన ఇటలీలోని ఫ్యామిలీ సర్కస్ షోలో జరిగింది. గురువారం ఓ ట్రైనర్ తన రెండు పులులతో అక్కడికి చేరుకున్నాడు. ఎన్‌క్లోజర్‌లో తన రెండు పులులకు విన్యాసాలు చేయమని సూచించడం వైరల్ వీడియోలో కనిపిస్తుంది. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. అయితే, ఒక పులి వైపు ట్రైనర్ నిలబడి సూచనలు చేస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన మరో పులి అతనిపై విరుచుకుపడింది.

అయితే.. పులి ట్రైనర్‌పై అటాక్ చేయగా.. అతని కాలు పట్టుకుని పక్కకు లాగింది. తలపై పలుమార్లు దాడి చేసింది. అనంతరం అతనిపై కూర్చుని దాడి చేయడం ప్రారంభించింది. పులి దాదాపు రెండు నిమిషాల పాటు ట్రైనర్‌పై దాడి చేస్తూనే ఉంది. ఈ భయంకరమైన వీడియో నెటిజన్లను షాక్ కు గురిచేసింది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

పులి దాడి చేసిన వెంటనే సర్కస్ సిబ్బంది లోపలికి ప్రవేశించి ఎలాగోలా పులి నుంచి అతనిని రక్షించారు. శిక్షకుడికి మెడ, కాలు, చేతికి తీవ్రమైన గాయం కావడంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై నెటిజన్లు పలు రకాలు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి క్రూర జంతువులతో జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..