Funny Video: ఇది కదా మిరాకిల్ అంటే.. దెబ్బకు ప్యాంట్ చేతపట్టి పరుగో పరుగు..
సింహాద్రి సినిమాలో వేణుమాధవ్ తన కాళ్లు పడిపోయినట్లు నటిస్తూ వీల్ చైర్‌లో కూర్చుని వైద్యశాలలో పెట్టే ఉచిత ఆహారాన్ని ముప్పొద్దులా కుమ్మేస్తుంటాడు. అయితే, వేణుమాధవ్ డ్రామాను గుర్తించిన
సింహాద్రి సినిమాలో వేణుమాధవ్ తన కాళ్లు పడిపోయినట్లు నటిస్తూ వీల్ చైర్‌లో కూర్చుని వైద్యశాలలో పెట్టే ఉచిత ఆహారాన్ని ముప్పొద్దులా కుమ్మేస్తుంటాడు. అయితే, వేణుమాధవ్ డ్రామాను గుర్తించిన హీరో ఎన్టీఆర్.. తనదైన శైలిలో ఝలక్ ఇచ్చి అసలు నిజం బయటపడేలా చేస్తాడు. అచ్చం అలాంటిదే సీన్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాతో రచ్చ చేస్తోంది. అది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇది కదా అసలైన మిరాకిల్ అంటూ పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి వీల్‌చైర్‌లో కూర్చుపి బిక్షాటన చేస్తున్నాడు. అలాగే వీల్‌చైర్‌ను నెట్టుకుంటూ వచ్చి.. రోడ్డుదాటేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతలో ఊహించని ఉపద్రవం దూసుకొచ్చింది. అతని వీల్ చైర్ వైపు ఓ వైక్ రయ్‌మంటూ దూసుకొచ్చింది. బైక్ స్పీడ్‌గా రావడాన్ని గుర్తించిన ఆ వీల్ చైర్‌లోని వ్యక్తి.. ఒక్కసారిగా పైకి లేచి పరుగులు తీస్తాడు. బతికింటే బలుసాకు అయినా తిని బతుకొచ్చని భావించి.. పడుతూ లేస్తూ ప్యాంట్ చేతపట్టి పరుగులు తీశాడు.
కాగా, ఈ ఫన్నీ ఘటనను అంతా అక్కనున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్ అయ్యింది. వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అతను పరుగులు తీసిన విధానం చూసి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.
వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో ఇదే..
Believe in miracles! ?? pic.twitter.com/yiy7xOMI3y
— Figen (@TheFigen_) December 31, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..