AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఓర్నీ ఇదేం చిత్రం.. పేదలకు పంచే పింఛన్ల సొమ్ములో దొంగ నోట్లు.. ఎక్కడంటే..?

పింఛన్ల పంపిణీ సమయంలో నకిలీ నోట్లు రావడంతో ప్రజలు కంగుతిన్నారు. ఏపీలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నరసాయపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

AP News: ఓర్నీ ఇదేం చిత్రం.. పేదలకు పంచే పింఛన్ల సొమ్ములో దొంగ నోట్లు.. ఎక్కడంటే..?
Fake Notes in Pension Distribution
Ram Naramaneni
|

Updated on: Jan 01, 2023 | 3:35 PM

Share

ఈ వార్త విని మీరు స్టన్ అయ్యే ఉంటారు. అవును నిజమే ఆసరా పెన్షన్ల సొమ్ములో ఫేక్ నోట్లు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఏపీలోని ప్రకాశం జిల్లా నరసాయపాలెంలో ఈ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి వెళ్లి లోకల్ వాలంటీర్ లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేవాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఇచ్చిన పెన్షన్ అమౌంట్‌తో ఏదో కొనబోతుండగా ఫేక్ నోటును గుర్తించాడు. ఈ విషయం వెంటనే గ్రామమంతా పాకింది. వాలంటీరు తన వద్ద ఉన్న నగదు తనిఖీ చేయగా.. అందులో కూడా ఫేక్ నోట్లు ఉన్నాయి. పెన్షన్ సొమ్ములో 38 వరకూ రూ.500 నకిలీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని వాలంటీరు ఉన్నతాధికారులకు అందజేశాడు.

తాము ప్రతి నెలా చివరిలో బ్యాంకు నుంచే పెన్షన్ తీసుకువస్తామని పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపాడు.  తరువాత వాలంటీర్లను పిలిపించి.. లిస్ట్ చూసి.. అవసరమైన నగదు అందజేస్తామన్నారు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి పించన్ డబ్బు పంపిణీ మొదలుపెట్టారని.. తనకు  7 గంటలకు విషయం తెలిసిందన్నారు.  మొత్తం 38 నోట్లు.. అంటే రూ.19 వేల ఫేక్ నోట్లు వచ్చాయన్నారు

తాను వేకువజామునే వెళ్లి అర్హులందరికీ పింఛన్లు పంపిణీ చేశానని వాలంటీర్ తెలిపారు. తెల్లవారిన తరువాత..ఇవి నకిలీ నోట్లని పింఛను తీసుకున్నవారు చెప్పడంతో తనకు విషయం తెలిసిందన్నారు. వాటిని పరిశీలించి.. అధికారులకు సమాచారం ఇచ్చానట్లు వెల్లడించాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..