Vizianagaram: న్యూ ఇయర్ వేళ విషాదం.. భీమిలీ కబడ్డీ జట్టు తరహాలో యువకుడు మృతి

విజయనగరం జిల్లాలో నూతన సంవత్సర వేళ నిర్వహించిన కబడ్డీ పోటీలు విషాదాన్ని మిగిల్చాయి. ఈ పోటీలలో పాల్గొన్న యువకుడు గాయపడి ప్రాణాలు కోల్పొయాడు.

Vizianagaram: న్యూ ఇయర్ వేళ విషాదం.. భీమిలీ కబడ్డీ జట్టు తరహాలో యువకుడు మృతి
Young Man Died
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 01, 2023 | 3:23 PM

విజయనగరం జిల్లాలో కబడ్డీ ఆటలో రమణ అనే యువకుడి మృతి విషాదం నింపింది. కబడ్డీ ఆటలో తోటి ఆటగాళ్లు మీద పడటంతో ఊపిరాడక చనిపోయాడా? లేదంటే ఆటలో ఇంకేదైనా జరిగిందా అన్న అనుమానాల మధ్య రమణ డెడ్‌బాడీని కేజీహెచ్‌కు తరలించారు. బాధిత కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆటకు వెళ్లొస్తానన్న రమణ శవమై కనిపించడంతో తట్టుకోలేకపోతున్నారు.

ఏపీలోని  విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం యోరుకొండలోఈ విషాదం ఘటన జరిగింది. న్యూఇయర్ సందర్భంగా నాలుగు గ్రామాల మధ్య కబడ్డీ పోటీలు జరిగాయి. అగ్రహారం, ఎరుకొండ, వెంపడాం, కొవ్వాడ నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఎరుకొండ, వెంపడాం జట్లు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. కూతకు వచ్చిన వెంపడాం క్రీడాకారుడ్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు ఎరుకొండ ఆటగాడు రమణ. ఆ వెంటనే వెనక ఉన్న ఇతర క్రీడాకారులంతా రమణపై పడ్డారు. దీంతో రమణ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ప్రాణం పోయిందని వైద్యులు నిర్ధారించారు.

కబడ్డీ కోర్టులో రైడర్‌ని పట్టుకోబోయి రమణ మృతి చెందడాన్ని తోటి ప్లేయర్స్‌, ఫ్రెండ్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. మృతుని ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..