AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanjay Raut: దేశ రాజకీయాల్లో సరికొత్త మార్పు.. రాహుల్ భవితవ్యంపై ఊహించని కామెంట్స్ చేసిన శివసేన ఎంపీ..

శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే) నేత కీలక వ్యాఖ్యలు చేశారు. 2022లో రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కొత్త వైభవం సంతరించుకుందని పేర్కొన్నారు. ఇదే వైభవం 2023లోనూ కొనసాగితే..

Sanjay Raut: దేశ రాజకీయాల్లో సరికొత్త మార్పు.. రాహుల్ భవితవ్యంపై ఊహించని కామెంట్స్ చేసిన శివసేన ఎంపీ..
Sanjay Raut, Rahul Gandhi
Shaik Madar Saheb
|

Updated on: Jan 01, 2023 | 3:28 PM

Share

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆపార్టీ శ్రేణులతోపాటు యూపీఏ కూటమి నాయకుల్లో జోష్ నింపింది. ఈ క్రమంలో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే) నేత కీలక వ్యాఖ్యలు చేశారు. 2022లో రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కొత్త వైభవం సంతరించుకుందని పేర్కొన్నారు. ఇదే వైభవం 2023లోనూ కొనసాగితే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశ రాజకీయాల్లో సరికొత్త మార్పును చూడవచ్చంటూ సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. శివసేన అధికారిక పత్రిక సామ్నాలో సంజయ్ ప్రతి ఆదివారం రాసే కాలమ్ రోఖ్‌థోక్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీపై కూడా విమర్శలు చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కూడా పలు వ్యాఖ్యలు చేశారు. దేశంలో విద్వేష, విభజన విత్తనాలను నాటవద్దని సూచించారు. రామ మందిర నిర్మాణ అంశానికి పరిష్కారం దొరికిందనిని పేర్కొన్న సంజయ్ రౌత్.. ఇక దీన్ని ఆసరాగా చేసుకొని ఓట్లు అడిగే పరిస్థితులు లేవంటూ శివనేన యూబీటీ నేత పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ‘లవ్‌ జిహాద్‌’ అనే కొత్త అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు. ఈ ఆయుధాన్ని వాడుకొని ఓ వర్గంలో భయాన్ని సృష్టించి తద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందాలనుకుంటున్నారా..? అంటూ బీజేపీని ప్రశ్నించారు. నటి తునీషా శర్మ, శ్రద్ధా వాకర్‌ హత్యలు లవ్‌ జిహాదీ కింద జరిగినవి కాదంటూ వ్యాఖ్యానించారు. అయితే, మహిళలు ఏవర్గానికి చెందిన వారైనా.. వారిపై దాడులు సరికాదని.. ఇలాంటి అఘాయిత్యాలు జరగకూడదని పేర్కొన్నారు.

2023 లో భారత్‌ భయం గుప్పిట్లో నుంచి బయటపడాలని ఆకాంక్షిస్తున్నానని రౌత్‌ ఈ సందర్బంగా పేర్కొన్నారు. రాహుల్‌ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర విజయవంతమవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్నది అధికార రాజకీయమని.. రాహుల్ గాంధీ యాత్ర విజయవంతమై లక్ష్యం నెరవేరుతుందని ఆశిస్తున్నా.. అంటూ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

సంకుచిత ఆలోచనా ధోరణిని విడనాడాలని ప్రధాని మోడీ తరచూ చెబుతుంటారని.. కానీ, ఆ వైఖరి బీజేపీలోనే అధికంగా ఉందని విమర్శించారు. విపక్ష పార్టీలకు ఉన్న హక్కుల్ని గుర్తించడానికి కూడా పాలకులు సుముఖంగా లేరంటూ రౌత్ విమర్శించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..