Andhra Pradesh: ‘రంగాను హత్య చేయించింది ఎవరో మీరే చెప్పారు’.. ఏపీలో కాకరేపుతున్న కాపు నేతల మధ్య లేఖలు..
మాజీ మంత్రి, సీనియర్ నేత హరిరామ జోగయ్యకు ప్రజెంట్ ఐటీ మినిస్టర్ అమర్‌నాధ్ మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది. కాపుల అంశంపై వరుసగా హరిరామ జోగయ్య రాస్తున్న లేఖలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు మంత్రి అమర్‌నాధ్.

మాజీ మంత్రి, సీనియర్ నేత హరిరామ జోగయ్యకు ప్రజెంట్ ఐటీ మినిస్టర్ అమర్‌నాధ్ మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది. కాపుల అంశంపై వరుసగా హరిరామ జోగయ్య రాస్తున్న లేఖలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు మంత్రి అమర్‌నాధ్. మంత్రి అమర్‌నాథ్ తాజాగా రాసిన మూడో లేఖలో వంగవీటి రంగా హత్యను ప్రస్తావించారు. రంగాను చంపింది చంద్రబాబేనని పలు సందర్భాల్లో మీరే చెప్పారు. మీరు రాసిన పుస్తకాల్లో తప్పులు, అబద్ధాలు ఉంటే అదే విషయం ప్రజలకు చెప్పాలన్నారు. మీ పుస్తకంలో మీరు రాసిన విషయాలను.. ఇలా విత్‌డ్రా చేసుకుంటారని మాకు తెలియదు అంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి. రంగా హత్యపై కాపు డీఎన్‌ఏ ఉన్న ఎవరిని అడిగినా చెబుతారు.. దీనికి మీరు, పవన్ మినహాయింపు అయితే మీ ఇష్టం అంటూ చురుకలంటిచారు. అలాంటి చంద్రబాబుతో పొత్తులకు సిద్ధమైన పవన్ కల్యాణ్‌ను మీరు సమర్ధిస్తారా అంటూ హరిరామ జోగయ్యను.. మంత్రి అమర్‌నాధ్ ప్రశ్నించారు.
మరోవైపు, అమర్‌నాధ్ రాసిన లేఖకు ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు హరిరామజోగయ్య. అనవసరంగా ఉత్తరాలు మీద ఉత్తరాలు వ్రాసి తన ఓపికను పరీక్షించవద్దని చెప్పారు. తనను రెచ్చకొట్టడం ద్వారా లాభ పడాలని ప్రయత్నించకు.. చెప్పిన దాంట్లో సత్యం ఎంతో ఆలోచించు అంటూ హితవు పలికారు. అధికారంలో ఉన్నప్పుడు సాధ్య పడక పోయినా చివరి దశలో నైనా కాపుల సంక్షేమం కోసం తలపడ్డానన్నారు.
కాపులకు రిజర్వేషన్లు కల్పించడం మొదటి లక్ష్యం అయితే బడుగు బలహీన వర్గాలకు అధికారం దక్కించాలన్నది రెండవ లక్ష్యమని చెప్పారు. అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో రెండు కులాలే అధికారం చేపడుతున్నాయి.. ఈ దౌర్భాగ్య స్థితి నుండి రాష్ట్రాన్ని కాపాడాలనే కానీ కుల పిచ్చి కాదంటూ లెటర్ లో కౌంటర్ ఇచ్చారు హరిరామజోగయ్య.




మరిన్ని ఏపీ వార్తల కోసం..