Dharmana Prasada Rao: చర్చకు సిద్ధం.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమలును ఎప్పుడో ఆపేశాం.. టీడీపీకి మంత్రి ధర్మాన స్ట్రాంగ్ కౌంటర్..

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఖండించారు. వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీడీపీ చూస్తోందని మండిపడ్డారు. రిజిస్ట్రేషన్ల శాఖ విడుదల చేసిన కార్డు 2.Oపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Dharmana Prasada Rao: చర్చకు సిద్ధం.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమలును ఎప్పుడో ఆపేశాం.. టీడీపీకి మంత్రి ధర్మాన స్ట్రాంగ్ కౌంటర్..
Dharmana Prasada Rao
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 29, 2024 | 1:29 PM

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఖండించారు. వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీడీపీ చూస్తోందని మండిపడ్డారు. రిజిస్ట్రేషన్ల శాఖ విడుదల చేసిన కార్డు 2.Oపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయో ఏపీ కూడా అదే చేస్తోందన్నారు. ఎన్నికల సమయం కాకపోయి ఉంటే.. టీడీపీపై క్రిమినల్‌ కేసు పెట్టేవాళ్లమని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ కేంద్రం తీసుకొచ్చిన చట్టమంటూ మంత్రి ధర్మాన ప్రసాద్ గుర్తుచేశారు. ఈ చట్టాన్ని ఎప్పుడో ఆపేశామని చెప్పినా.. టీడీపీ కావాలనే రాజకీయం చేస్తోందని ఆరోపించారు. దీనిపై మాట్లాడేందుకు ఏ వైదికపైకి అయినా వస్తానని మంత్రి ధర్మాన సవాల్‌ విసిరారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశంపై టీడీపీ చేసిన ఆరోపణలపై ధర్మాన ప్రసాదరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని ఎప్పుడో చెప్పాం.. మళ్లీ ఇప్పుడు స్పష్టంచేస్తున్నామన్నారు. భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలన్నది కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంనిర్ణయం.. ఈ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకు వస్తూనే ఉందన్నారు. అదే బీజేపీతో టీడీపీ ఇప్పుడు జట్టుకట్టిందన్నారు. మళ్లీ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ నేతలు వక్రభాష్యాలు చెప్తున్నారంటూ మండిపడ్డారు.

న్యాయస్థానాల్లో దాఖలైన పిటిషన్లపై తీర్పులు తర్వాత.. దేశవ్యాప్తంగా దీనిపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే ఆలోచన చేస్తామంటూ ధర్మాన ప్రసాదరావు క్లారిటీ ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యక్ట్ అన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదన్నారు. ఇది కాకుండా రైతులకు మేలు చేసేలా అనేక సంస్కరణలు చేశామన్నారు. సమగ్ర సర్వే ద్వారా ఎంతో మేలు చేకూరుతోందన్నారు. అత్యాధునిక టెక్నాలజీని సర్వేకోసం వినియోగించామని.. దీనివల్ల రికార్డులు అప్ టు డేట్ గా ఉంటాయన్నారు. పరిపాలన వికేంద్రకరణ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వస్తాయని.. మొత్తం కంప్యూటరీకరణ జరుగుతుందని.. ఆటోమేటిగ్గా మ్యుటేషన్ జరుగుతుందని ధర్మన ప్రసాదరావు పేర్కొన్నారు. ఇంత చేస్తుంటే.. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ టీడీపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకోసం ఏరోజూ ఆలోచించని వారు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్ భూములు తీసుకునేవాడా? భూములు పంచేవాడా? ఈ ఐదేళ్ల పాలనే చెప్తుందని గుర్తుచేశారు.

వీడియో చూడండి..

26 లక్షల ఎకరాలపై నిరుపేదలకు సర్వహక్కులు కల్పించింది జగన్ కాదా అని ప్రశ్నించారు. అలాంటి జగన్ భూములు తీసుకునేవాడిలా కనిపిస్తున్నారా..? స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఇలా జరిగిందా?.. ఇంత గొప్ప నాయకుడు ఎక్కడైనా ఉన్నారా..? జగన్ భూములను నిరుపేద రైతులకు పంచారని.. 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చిన జగన్ మీకు భూమిని లాక్కునేవాడిలా కనిపిస్తున్నారా..? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలంతా అమయాకులని అనుకుంటున్నారా?.. మీరేం చెప్తే అది నమ్ముతారన్న భ్రమలో ఉన్నారా..?

మీ చేతిలో ఉన్నవి ఎల్లో మీడియా మాత్రమే? కాని ప్రజల చేతిలో ఫోన్ల రూపంలో కోట్లాది ఛానల్స్ ఉన్నాయంటూ ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. నిజాలను వారే అందరికీ వివరిస్తారన్నారు. ప్రజల భూములు తీసుకుని వ్యాపారాలు తీసుకునే భావజాలం టీడీపీదని.. భూములను నిరుపేదలకు పంచాలన్న భావజాలం జగన్ ది అన్నారు. చెప్పుకోవడానికి ఏమీ లేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఏ వేదికపైనైనా వచ్చి చర్చకు తాను సిద్ధమని.. రైతులకు అనుకూల నిర్ణయలు తప్ప, ఒక్క వ్యతిరేక నిర్ణయాన్నీ తీసుకోలేదని.. దొంగరాతలు, తప్పుడు ప్రచారాలు మానండి.. అంటూ టీడీపీ నేతలకు సూచించారు.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో