Andhra Pradesh: పుట్టినరోజు వేడుకలకు యానం వెళ్లి ఫుల్లుగా తాగారు.. కట్ చేస్తే, నాలుగు ప్రాణాలు..

ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకలు.. ఇంక తగ్గేదేలే.. జోరుగా హుషారుగా ఎంజాయ్ చేద్దామనుకున్నారు.. దానికి యానంను ఎంచుకున్నారు.. మంచిగా యానం వెళ్లారు.. ఫుల్లుగా పీకల దాకా తాగారు.. అందరూ మద్యం మత్తులోనే అక్కడినుంచి రాత్రి వేళ ఆటోలో ఇళ్లకు పయనమయ్యారు.. ఈ క్రమంలోనే ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది..

Andhra Pradesh: పుట్టినరోజు వేడుకలకు యానం వెళ్లి ఫుల్లుగా తాగారు.. కట్ చేస్తే, నాలుగు ప్రాణాలు..
Road Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 29, 2024 | 12:12 PM

ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకలు.. ఇంక తగ్గేదేలే.. జోరుగా హుషారుగా ఎంజాయ్ చేద్దామనుకున్నారు.. దానికి యానంను ఎంచుకున్నారు.. మంచిగా యానం వెళ్లారు.. ఫుల్లుగా పీకల దాకా తాగారు.. అందరూ మద్యం మత్తులోనే అక్కడినుంచి రాత్రి వేళ ఆటోలో ఇళ్లకు పయనమయ్యారు.. ఈ క్రమంలోనే ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.. దీంతో నలుగురు యువకులు దుర్మరణం చెందారు.. ఈ ఘోర రోడ్డు ప్రమాదం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలోని భట్నవల్లీలో జరిగింది. యానంలో బర్త్‌ డే పార్టీ ముగించుకొని ఆటోలో తిరిగి వస్తున్న నలుగురు యువకులు దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. వేగంగా వస్తున్న ఆటో లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

అర్ధరాత్రి వరకు యానాంలో ఫుల్లుగా మద్యం తాగి ఆటోలో తిరిగి వస్తుండగా.. అర్థరాత్రి 12.30 గంటల ప్రాంతంలో అమలాపురం మండలం భట్నవిల్లిలో దగ్గర ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలతో కిమ్స్ లో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

మృతులను నవీన్ (22), జతిన్ (26), నల్లి నవీన్ (27), అజయ్ (18)గా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మామిడికుదురు మండలం నగరం గ్రామస్థులుగా, మరొకరు పీ.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన యువకుడిగా గుర్తించారు. ఆటో డ్రైవర్‌ మద్యం మత్తులో వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!