Andhra Pradesh: ఇదెక్కడి వింత.! చింతచెట్టు నుంచి ధారగా కారుతున్న పాలు.. క్యూ కట్టిన జనాలు..

ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక మూల ఏదో ఒక వింత జరుగుతూనే ఉంది. దేవతా విగ్రహాలు పాలు తాగడం, ఆలయంలో కోతులు పూజలు చేయడం..

Andhra Pradesh: ఇదెక్కడి వింత.! చింతచెట్టు నుంచి ధారగా కారుతున్న పాలు.. క్యూ కట్టిన జనాలు..
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 24, 2023 | 10:20 AM

ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక మూల ఏదో ఒక వింత జరుగుతూనే ఉంది. దేవతా విగ్రహాలు పాలు తాగడం, ఆలయంలో కోతులు పూజలు చేయడం, వేపచెట్టునుంచి పాలుకారడం ఇలా ఎన్నో వింత ఘటనలు చూశాం. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో మరో విచిత్ర సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే…

అన్నమయ్య జిల్లాలో వింత ఘటన చర్చనీయాంశంగా మారింది. మదనపల్లి, కురబల కోట మండలం కొండమర్రిలో చింతచెట్టునుంచి పాలు ధారగా కారడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎప్పటిలాగే పొలం పనులకు పొలానికి వెళ్లిన ఓ రైతు చింత చెట్టునుంచి పాలు కారడం గమనించాడు. అక్కడున్న ఓ పెద్ద చింత చెట్టు కొమ్మనుంచి తెల్లని ద్రవం ధారగా పడుతుండటంలో.. అనుమానం ఏమై ఉంటుందా అని ఓ గ్లాసులోకి దానిని పట్టి చూశాడు. ఈ విషయం ఆనోటా ఈనోటా గ్రామస్తులకు చేరింది. దాంతో ఈ వింతను చూసేందుకు జనం పొలానికి క్యూకట్టారు. ఈ ఘటన చూసి కొందరు మాత్రం ఇది బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినట్లే జరుగుతోందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి