JC Prabhakar Reddy: తాడిపత్రిలో ఉద్రిక్తత.. జేసీ ప్రభాకర్ రెడ్డి గృహనిర్బంధం

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పెన్నానదిలో అక్రమంగా ఇసుక తరలింపును నిరసిస్తూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర రెడ్డి ఆందోళన నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే పెద్దపప్పూరు మండలం పెన్నానదిలో ఇసుక తరలింపు పరిశీలనకు వెళ్లాలనుకున్నారు.

JC Prabhakar Reddy: తాడిపత్రిలో ఉద్రిక్తత.. జేసీ ప్రభాకర్ రెడ్డి గృహనిర్బంధం
Jc Prabhakar Reddy
Follow us
Aravind B

|

Updated on: Apr 24, 2023 | 10:34 AM

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పెన్నానదిలో అక్రమంగా ఇసుక తరలింపును నిరసిస్తూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర రెడ్డి ఆందోళన నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే పెద్దపప్పూరు మండలం పెన్నానదిలో ఇసుక తరలింపు పరిశీలనకు వెళ్లాలనుకున్నారు. ఈ క్రమంలో ఆయనను పోలీసులు ఇంటి నుంచి బయటకు రాకూడదంటూ గృహ నిర్బంధం చేశారు. జేసీ నివాసం వద్దకు మీడియాను కూడా  అనుమతించడం లేదు. బ్యారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్నారు. ఇంటి నుంచి బయటకు రాకుండా జేసీ నివాసం వద్ద పోలీసులు భారీగా మొహరించారు. జేసీ నివాసం చుట్టుపక్కల కూడా బ్యారికేడ్లు పెట్టి టీడీపీ నేతలు, కార్యకర్తలు రాకుండా పోలీసులు ఆపుతున్నారు.

ముందుగా పెద్దపప్పూరు మండలంలో టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్టు నుంచి తప్పించుకుని రోడ్డెక్కారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైటాయించారు. ఈ క్రమంలోనే పోలీసులు, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే జేసీ రోడ్డుపై అడ్డంగా పడిపోయారు. అనంతరం ఆయన్ని బలవంతగా అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తీసుకెళ్లారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి