Viral Video: స్టైల్‌గా బైక్ ఎక్కాలనుకుంది.. కట్ చేస్తే.. చివరికి మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.!

బైక్‌పై రాని విన్యాసాలు చేసేవారు కొందరైతే.. జన సందోహం ఉన్న ప్రాంతాల్లో పిచ్చి పిచ్చి చేష్టలు వేసేవారు మరికొందరు. ఇలాంటి వీడియోలు నెట్టింట చాలానే చూసి ఉంటారు.

Viral Video: స్టైల్‌గా బైక్ ఎక్కాలనుకుంది.. కట్ చేస్తే.. చివరికి మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.!
Viral Video
Follow us
Ravi Kiran

| Edited By: seoteam.veegam

Updated on: Apr 24, 2023 | 4:40 PM

సోషల్ మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి ప్రతీ ఒక్కరూ లైకులు, వ్యూస్ కోసం చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. బైక్‌పై రాని విన్యాసాలు చేసేవారు కొందరైతే.. జన సందోహం ఉన్న ప్రాంతాల్లో పిచ్చి పిచ్చి చేష్టలు వేసేవారు మరికొందరు. ఇలాంటి వీడియోలు నెట్టింట చాలానే చూసి ఉంటారు. ఆ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. స్టైల్‌గా బైక్ ఎక్కాలని ప్రయత్నించిన ఓ యువతి చేసిన ఫీట్‌కు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

‘వై షుడ్ ఓన్లీ బాయ్స్ హావ్ ఫన్’ అని అనుకున్నదో.. ఏంటో.. స్టైలిష్ స్పోర్ట్స్‌ బైక్‌పై స్టంట్ చేసేందుకు సిద్దమైంది ఓ యువతి. స్టాండ్ వేసి ఉన్న బైకు పైకి వినూత్నంగా ఎక్కాలని చూసింది. స్టైల్‌గా కాలు పైకి లేపి, బైకుపై కూర్చోవాలని ప్రయత్నించింది. ఆ బైక్ ఏమో ఎత్తుగా ఉండటంతో.. కాలు ఫ్యూయల్ ట్యాంక్‌కు తగిలి ఠక్కున ధమాల్ అని పడిపోతుంది. ‘అయ్యో.! అమ్మో..! అంటూ నొప్పితో’ కాసేపటికి పైకి లేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. కాగా, ఈ వీడియోపై లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయి.

ఇవి కూడా చదవండి